ప్రభాస్ కెరీర్‌లోని 25వ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్ దక్కించుకున్నారు అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా. ‘స్పిరిట్’ అనే టైటిల్‌తో అక్టోబరు 7న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అయితే ‘స్పిరిట్’ మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, జపాన్, చైనీస్, థాయ్ భాషల్లో కూడా విడుదల కానుందని టైటిల్ ఎనౌన్స్మెంట్ పోస్టర్‌తో కన్ఫార్మ్ చేశారు. అయితే ఇప్పటికే ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు ఉన్నాయి. మరోవైపు రణ్‌బీర్‌కపూర్‌తో ‘యానీమల్’ సినిమాను చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగా. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా వారి వారి ప్రాజెక్ట్స్ కమిట్మెంట్స్ను పూర్తి చేసుకున్న తర్వాత ‘స్పిరిట్’ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు సినిమాలు ఉండటంతో ఆయన అభిమా నులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే. సో..ప్రభాస్ సినిమాలను గురించిన మరిన్ని అప్డేట్స్ను మనం ఆశించవచ్చు.
ఎనిమిది భాషల్లో స్పిరిట్
Leave a comment
Leave a comment