ప్రజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. అలాగే పనిలో పనిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అని, ఇందులో ఎన్టీఆర్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించ నున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీకపూర్ కనిపిస్తారే ప్రచారం కూడా వినిపిస్తోంది.
దర్శకుడు సుకుమార్‌తో ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘నాన్నకు ప్రేమతో..’ సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్. ఈ సినిమా సమయంలోనే ఎన్టీఆర్‌కు, బుచ్చిబాబుకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు బుచ్చిబాబు ఓ కథ చెప్పగా, దాన్ని డెవలప్ చేయాల్సిందిగా ఎన్టీఆర్ కోరారు. అయితే ఎన్టీఆర్‌కు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా బుచ్చిబాబుతో సినిమా చేయలేదు ఎన్టీఆర్. ఆ లోపు ‘ఉప్పెన’తో బంపర్‌హిట్ కొట్టారు బుచ్చిబాబు. ఇటు తన కమిట్మెంట్స్ను పూర్తి చేసిన ఎన్టీఆర్ లేటెస్ట్గా బుచ్చిబాబుకు చాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఉప్పెనతో మైత్రీమూవీమేకర్స్కు మంచి హిట్ ఇచ్చారు బుచ్చిబాబు. దీంతో ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమాను కూడా మైత్రీమూవీమేకర్సే నిర్మిస్తుంది. ఎన్టీఆర్ హీరోగా చేసిన జనతాగ్యారేజ్ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్సే నిర్మించిన సంగతి విదితమే