బర్త్ డే రోజు రెండు సినిమాలను అనౌన్స్ చేసి అభిమానులకు డబుల్ బొనాంజా ట్రీట్ ఇచ్చారు నయనతార. తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి నయనతార స్టార్ట్ చేసిన రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థలో నయనతార ప్రధాన పాత్రలో ‘కనెక్ట్’ సినిమా తెరకెక్కనుంది. ఇందులో నయనతారతో పాటుగా సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ అనుపమ్‌ఖేర్ కీలక పాత్రలు చేస్తారు.
ఇక తెలుగులో చిరంజీవి హీరోగా మలయాళం హిట్ లూసీఫర్ తెలుగులో ‘గాడ్‌ఫాదర్’గా వస్తోంది. ఈ సినిమాలో నయనతార భాగమౌతారని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతున్నప్పటికీ నవంబరు 18 అంటే నయనతార బర్త్ డే రోజున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి మోహన్‌రాజా డైరెక్టర్. ఇక చిరంజీవి ‘సైరా:నరసింహారెడ్డి’ నటించిన నయన తార మరోసారి చిరుకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం విశేషం.