నాని కెరీర్‌లో 29వ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ దసరా పండగ సందర్భంగా వచ్చింది. నాని హీరోగా నటించనున్న లేటెస్ట్ సినిమాకు ‘దసరా’ టైటిల్ ఖరారైంది. దసరా పండగ సందర్భంగా ‘నాని దసరా’ సినిమా అప్ డేట్‌ను ప్రకటించారు. శుక్రవారం మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాతో శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఇక సుధాకర్ చెరుకూర ఈ చిత్ర నిర్మాత. అలాగే ఇందులో కీర్తీ సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘నేను లోకల్’ సినిమా తర్వాత నాని, కీర్తీ సురేశ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే దసరా చిత్రం కోసం నాని పక్కా తెలంగాణ యాసలో మాట్టాడుతున్న డైలాగ్స్ ‘దసరా’ మోషన్ పోస్టర్‌లో వినిపించాయి. ప్రస్తుతం నాని ‘శ్యామ్‌సింగరాయ్’ చిత్రంలో బిజీగా ఉన్నాడు. ఈ డిసెంబరులో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే నాని ‘అంటే.. సుందరానికి’ చిత్రం కూడా చేస్తున్నారు.
నాని దసరా అదిరిపోయింది
Leave a comment
Leave a comment