బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. విడుదలైన గ్లింప్స్‌ని బట్టి ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఊర్వశీ రౌతెలా ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. పోలీసాఫీసర్ గా ఆమె కనిపిస్తారు ఈ సినిమాలో. బందిపోట్ల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ కెరీర్లో రూపొందుతున్న 109వ సినిమా ఇది. దసరాకు తొలుత ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇదే సమయలో ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో ఈ సినిమాను డిసెంబరు తొలివారంలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్. బాలకృష్ణ ‘అఖండ’ చి త్రం కూడా డిసెంబరు తొలివారంలోనే విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఒకవేళ డిసెంబరు మిస్ అయితే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని భోగట్టా.
సంక్రాంతికి బాలయ్య సినిమాలు చాలానే హిట్స్ కొట్టాయి. చివరి సారిగా బాలయ్య సంక్రాంతికి వచ్చింది ‘వీరసింహారెడ్డి’ సినిమాతో. ఆ సమయంలో చిరంజీవి ‘వాల్తేరువీరయ్య’ కూడా రిలీజైంది. ఈ సినిమాకు బాబీ డైరెక్టర్. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో బాలయ్య హీరోగా నటించిన సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే చిరంజీవి ‘విశ్వంభర’ను ఆల్రెడీ సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. జనవరి 10న రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. గతంలో ఐదారుసార్లు సంక్రాంతికి ఒకేసారి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు థియేటర్స్‌కు వచ్చాయి. చివరిసారిగా చిరంజీవి ‘వాల్తేరువీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలు వచ్చినప్పుడు …ఈ రెండు విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదలై మళ్లీ హిట్స్ కొడితే ఇండస్ట్రీలో నిజమైన సంక్రాంతి వాతావరణం ఉంటుంది.
Premalu Review: ప్రేమలు మూవీ రివ్యూ
కానీ ఈ సారి సంక్రాంతి బరిలో వెంకటేష్, నాగార్జున సినిమాలు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ‘బంగార్రాజు 3’తో నాగార్జున, ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌తో వెంకటేష్ సినిమా లు థియేటర్స్‌కు వస్తాయనే టాక్ వినిపిస్తోంది. మరి…ఏం జరుగుతుందో చూడాలి.