ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా రౌద్రం రణం రుధిరం సినిమాలోని దోస్తీ పాట తర్వాత తాజాగా నాటు నాటు పాటను విడుదల చేశారు రాజమౌళి. ప్యాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ సినిమాలోని నాటు నాటు పాట తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. తెలుగులో వచ్చిన నాటు నాటు పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. ఈ నాటు నాటు పాటను ఆల్మోస్ట్ షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. ఆర్ ఆర్ ఆర్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ కంటే ఈ పాటలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల డ్యాన్స్ ఫీట్స్ కనులవిందుగా ఉండటంతో ఫ్యాన్స్ ఈ పాటను బాగా ఏంజాయ్చే స్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం జనవరి 07న ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు భాషల్లో
విడుదల కానుంది.
ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్ కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఆలియాభట్, ఓలివియా మోరిస్ హీరోయిన్స్‌గా నటించారు. రేస్టీవెన్ సన్, అలిసన్ డూడీ, అజయ్ దేవగణ్, శ్రియ, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.