Bhavatharini: ప్రముఖ సంగీత దర్శకులు ఇళయారాజా కుమార్తె, గాయని-సంగీత దర్శకురాలు భావతారణి ఇకలేరు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న భావతరణి చికిత్స కోసం ఇటీవల శ్రీలంక వెళ్లారు. ఈ నెల 25న అక్కడే తుదిశ్వాస విడిచారు. ఇళయారాజాకు ఇద్దరు కుమారులు (సంగీత దర్శకులు కార్తీక్ రాజా, యువన్ శంకర్‌రాజా), కుమార్తె భావతరణి సంతానం. తండ్రి, సోదరుల మాదిరిగానే భావతరణి కూడా సంగీతాన్నే కెరీర్‌గా ఎంచుకుంది. అలాగే తండ్రి, ఇళయారాజాల సంగీత సారథ్యంలో ఎన్నో పాటలు పాడారు భావతరణి. దాదాపు పాతిక సినిమాల్లోని పాటలు పాడారామె.
పదికిపైగా సినిమాలకు సంగీత దర్శకురాలిగా పనిచేశారు. తెలుగు మూవీ గుండెల్లో గోదారి సినిమాలోని నీతోనే పాటను పాడారు భావతరణి. కన్నడ, తమిళం, తెలుగు,
హిందీ భాషల సినిమాలకు సంగీత దర్శకురాలిగా పనిచేశారు. తెలుగులో ‘అవునా’(2003) సినిమాకు పనిచేసిన భావతరణి, హిందీ ‘ఫిర్ మిలెంగే’ సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా పనిచేశారు. భారతి (2000) సినిమాలోని పాటకు గాను, సింగర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారామె. భవతరణి అంత్యక్రియలు శుక్రవారం
చెన్నైలో జరుగుతాయి. భర్త శబరిరాజ్ ఉన్నారు. వీరికి సంతానం లేరు.