Megahappy: మెగాకుటుంబం ఫుల్ జోష్‌లో ఉంది. మెగా ఇంట్లో వరుసగా ఆనందోత్సాహాలు జరుగుతున్నాయి. 2012లో రామ్‌చరణ్- ఉపాసన వివాహం చేసుకున్నారు. ఎప్పట్నుంచో సంతానం కోసం ఎదురుచూస్తున్న వీరికి 2023లో క్లీన్కార జన్మించింది. దీంతో ఫుల్ మెగాకాంపౌండ్ ఫుల్ హ్యాపీ. అలాగే ఆస్కార్ వేడుకు హాజరైన
తొలి తెలుగు నటుడిగా చిరంజీవిని చెప్పుకుంటారు. అలాంటిది రామ్‌చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో ఎన్టీఆర్ మరో హీరో)తో ఆస్కార్ స్టేజిపైకి వెళ్లారు. 2023లోనే ఈ హ్యాపీమూమెంట్ రామ్‌చరణ్‌కు దక్కింది. అలాగే జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు అవార్డు 2023లో వచ్చింది. ఈ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటు డు అల్లు అర్జున్. ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని అల్లు అర్జున్ నటనకు ఈ అవార్డు వచ్చింది. ఇక 2024 ప్రారంభంలోనే చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వరించింది.
2023లోనే వరుణ్‌తేజ్, లావణ్యా త్రిపాఠిల వివాహం జరిగింది. ఇలా వరుస హ్యాపీ ఇన్సిడెంట్స్‌లో మెగా కాంపౌడ్ ఫుల్ జోష్‌లో ఉంది.