మోహన్‌బాబు హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రం ఈ నెల 18న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో
మోహన్‌బాబు మాట్లాడుతూ–‘‘ నేను చేసిన ప్రతి సినిమా రిస్కే. ఆ విషయానికి వస్తే నా జీవితమే ఓ రిస్క్. పొట్టచేతపట్టుకుని కుటుంబంతో సహా ఇండస్ట్రీకి వచ్చి కష్టపడి సంపాదించి, ఈ ధనాన్ని విద్యాసంస్థల్లో పెట్టి అభివృద్ధి చేసి యూనీవర్సిటీగా తీర్చిదిద్దాం. ‘సన్ ఆఫ్ ఇండియా’ కథ చెప్పగానే మంచు విష్ణు ఓ లొగోను రెడీ చేసి పంపాడు. ‘సన్ ఆఫ్ ఇండియా’లాంటి చిత్రం రిస్కే అని తెలిసినా కూడా నా మాటను కాదన
లేక రిస్క్ చేశాడు విష్ణు. ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన పొలిటికల్ డైలాగ్స్ చెప్పాను. ప్రైవేటు
జైలు అనే కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు చూపించబోతున్నాం. ఇళయరాజాగారు అత్యద్భుతంగా సంగీతాన్ని ఇచ్చారు. ఈ చిత్రంలో ఓ పాట కోసం కోటి 80లక్షలు ఖర్చు చేశాం’’ అన్నారు.
మంచు విష్ణు మాట్లాడుతూ –‘‘సన్ ఆఫ్ ఇండియా’ వంటి కొత్తరకం సినిమాలు చేయగలిగిన వారు ఒక్క నాన్నగారు మాత్రమే’’ అని అన్నారు.
‘‘సినిమాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేయగలవు. సన్ ఆఫ్ ఇండియా సినిమాతో ఓ మంచి సందేశాన్ని ఇచ్చాం’’ అన్నారు దర్శకుడు డైమండ్ రత్నబాబు.
మంచు లక్ష్మీ మాట్లాడుతూ – ‘‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రాన్ని చూసి పదిమంది పది మంచి విషయాలను నేర్చుకోవాలి. నాన్నగారితో వర్క్ చేసేందుకు ఇళయారాజాగారు ఎంతో ఇష్టపడతారు. నాన్నగారు
ఏదీ కోరుకుంటే అదీ ఏర్పాటు చేసిన విష్ణు నిజంగా గ్రేట్’’ అన్నారు.
నరేశ్ మాట్లాడుతూ – ‘‘హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్స్ ఉంటారు కానీ..ఇవన్నీ కలగలసిన
వారు ఎవరైనా ఉన్నారంటే అదీ మోహన్‌బాబుగారే. సన్ ఆఫ్ ఇండియా సక్సెస్ కావాలి’’ అన్నారు.
ఆలియా భట్ గంగుభాయి కతియావాడి ట్రైలర్
