నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన కాజల్ అగర్వాల్
గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ…
Nivetha Pethuraj:నిర్మాణం వైపు మాత్రం వెళ్లను
HEROINE Nivetha Pethuraj INTERVIEW: డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం…
విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన జోనర్ల సినిమాలతో అలరిస్తున్నారు. తన 10వ…
‘ఉగ్రం’ నా కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ: దేవేరి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్
‘నాంది’ చిత్రంతో కమర్షియల్ హిట్ అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. అల్లరి నరేష్ ని ఫెరోషియస్ పోలీస్ గా చూపించిన ఉగ్రం టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ దేవేరి సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. విన్న వెంటనే మనసుకు ఎంతగానో నచ్చేసే పాటిది. ట్యూన్, లిరిక్స్, కంపోజిషన్ మనసుల్ని ఆకట్టుకుంటాయి. శ్రీచరణ్ పాకాల మెలోడి, రొమాంటిక్ నెంబర్ ని అందించారు. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకోగా అనురాగ్ కులకర్ణి మ్యాజికల్ వాయిస్ మరింత మాధుర్యాని తెచ్చాయి. అల్లరి నరేష్, మిర్నాల కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఈ పాట లీడ్ పెయిర్ ఒకరికొకరు ఉన్న అనురాగాన్ని ప్రజంట్ చేస్తోంది. https://www.youtube.com/watch?v=4gY1RK8Gs1k సాంగ్ లాంచ్ ఈవెంట్ లో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ముందుగా ఆస్కార్…
నచ్చిన కథని నిర్మించామనే తృప్తి వుంటుంది : నిర్మాత రాజేష్
సందీప్ కిషన్ కథానాయకుడిగా. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఊరు పేరు భైరవకోన, శ్రీవిష్ణు కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన సామజవరగమనా చిత్రాలని హాస్య మూవీస్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణ లో నిర్మిస్తున్నారు రాజేష్ దండా. ఈ రెండు చిత్రాల విశేషాలని విలేఖరుల సమావేశంలో పంచుకున్నారాయన. నిర్మాతగా మీ ప్రయాణం గురించి? స్వామిరారా చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా నా ప్రయాణం మొదలైయింది. దాదాపు 82 చిత్రాలు డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. సందీప్ కిషన్ గారితో వున్న పరిచయం వలన కేరాఫ్ సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశాను. తర్వాత ఒక్క క్షణం, నాంది సినిమాలకి కో ప్రొడ్యూసర్ గా చేశాను. నాంది విడుదల తర్వాత మనమే ఎందుకు నిర్మాతగా చేయకూడదని అనిపించింది. టైగర్ సినిమా నుంచి సందీప్ కిషన్, విఐ ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ మొదలుపెట్టండి నేను సినిమా చేస్తా’ అని సందీప్ కిషన్, డైరెక్టర్ గారు అన్నారు. అలా హాస్య మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయ్యింది. అనిల్ సుంకర గారితో నాకు మంచి అనుబంధం వుంది. ఆయన బ్యానర్ లో ఆరు సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గా చేశాను. ఆయన సపోర్ట్ తో మరో రెండు సినిమాలు స్టార్ట్ అయ్యాయి. మొదట నిర్మించింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కదా ? దాని ఫలితం తృప్తిని ఇచ్చిందా ?మేము మొదట స్టార్ట్ చేసిన చిత్రం ఊరు పేరు భైరవకోన. కొన్ని కారణాల వలన అది ఆలస్యమైయింది. దీంతో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ముందు విడుదలైయింది. కమర్షియల్ సక్సెస్ మాట పక్కన పెడితే మంచి సినిమా తీశాననే పేరు తీసుకొచ్చింది ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఓటీటీలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఊరు పేరు భైరవకోన, సామజవరగమనా సినిమాల విడుదల ఎప్పుడు ?సామజవరగమనా సమ్మర్ లో విడుదలౌతుంది. ఊరు పేరు భైరవకోన చాలా పెద్ద స్కేల్ లో సూపర్ నేచురల్ ఫాంటసీగా చేస్తున్నాం. చాలా సీజీ వర్క్ వుంటుంది. జులై లేదా ఆగస్ట్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. ఊరు పేరు భైరవకోన లో గ్రాండ్ విజువల్స్, ఫన్, మంచి పాటలు వుంటాయి. మంచి కమర్షియల్ సినిమా ఇది. డిస్ట్రిబ్యూషన్ అంటే డబ్బులు పోగొట్టుకోవడమే ఎక్కువ అనే భావన వుంది కదా ?డిస్ట్రిబ్యూటర్ గా నాకు సక్సెస్ ఎక్కువ. ఏడాది లో పది సినిమాలు విడుదల చేస్తే ఎనిమిది హిట్లు. స్వామి రారా, కార్తికేయ, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రారా కృష్ణయ్య, నిను వీడని, ఎన్టీఆర్ గారి టెంపర్, మహేష్ బాబు గారి సరిలేరు నీకెవ్వరు ఇలా సెలెక్టెడ్ గా వెళ్లాను. డిస్ట్రిబ్యూషన్ లో విజయవంతంగానే వచ్చా. ఊరు పేరు భైరవకోన భారీ స్థాయిలో వుంటుంది అని సందీప్ కిషన్ గారు చెప్పారు ? బడ్జెట్ విషయంలో రిస్క్ అనిపించలేదా ?ఊరు పేరు భైరవకోన అద్భుతమైన కథ. సూపర్ నేచురల్ ఫాంటసీ ఫిల్మ్. ఖర్చు విషయంలో రిస్క్ అనుకోవడం లేదు. కథ అనుకున్నప్పుడే దిన్ని పెద్ద చేయాలని దిగాం. అప్పుడే డిస్ట్రిబ్యూషన్ నుంచి ఎంతకి ఇస్తారా అని అడుగుతున్నారు. టీజర్ పడే దాక దాని గురించి ఇప్పడే వద్దని చెప్పాం. డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ లో ఏది సులువు? ఏది కష్టం ?దేని కష్టం దానికి వుంది. అయితే నా వరకూ ప్రొడక్షన్ బావుందని భావిస్తున్నాను. మనకి నచ్చిన కథని నిర్మించామనే తృప్తి వుంటుంది. నెక్స్ట్ ప్లాన్స్ ఏమిటి ?ఆగస్ట్ లో నరేష్ గారితో సోలో గా ఒక సినిమా చేయబోతున్నా. సోలో బ్రతుకే సొ బెటరు ఫేం సుబ్బు గారు దీనికి దర్శకత్వం. అలాగే శ్రీవిష్ణు గారితో మరో సినిమా చర్చలో వుంది. సాయి ధరమ్ తేజ్ గారు నాకు ఇష్టమైన హీరో. ఆయనతో ఒక సినిమా చేయాలని వుంది. అలాగే నాంది దర్శకుడు విజయ్ కనకమేడలతో కూడా ఒక సినిమా చేయాలనే ఆలోచన వుంది.
అన్ స్టాపబుల్’ నుంచి బుల్ బుల్ అన్ స్టాపబుల్ సాంగ్ ని లాంచ్ చేసిన మాచో స్టార్ గోపీచంద్
విజె సన్నీ, సప్తగిరి, డైమండ్ రత్న బాబు, రజిత్ రావు 'అన్ స్టాపబుల్' నుంచి బుల్…
భోళా శంకర్ లో సుశాంత్
మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ ల క్రేజీ ప్రాజెక్ట్ “భోళా శంకర్”. ఈ…
రాజుగారు అన్న మాటలు మరచిపోలేం : నిర్మాతలు హర్షిత్, హన్షిత
దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా…
Bichhagadu2: బిచ్చగాడు 2 నుండి బికిలి సాంగ్ రిలీజ్
వైవిధ్యమైన సినిమాలతో తమిళ్ లో తనదైన శైలిలో రాణిస్తోన్న హీరో విజయ్ ఆంటోనీ. గతంలో నకిలీ,…