మోహన్‌బాబు హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘సన్ ఇఫ్ ఇండియా’. ‘డైమండ్’ రత్నబాబు ఈ సినిమాకు దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా టీజర్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాను ఫిబ్రవరి 18న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్న పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని పలుసందర్భాల్లో మోహన్‌బాబు చెప్పుకొచ్చారు. ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాకు మంచు విష్ణు నిర్మాత.
సన్ ఆఫ్ ఇండియా రిలీజ్‌కు రెడీ..ఎప్పుడంటే!
Leave a comment
Leave a comment