ప్రముఖ హీరో చిరంజీవి కుమార్తె శ్రీజ మరోసారి విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. తొలిసారి 2007 అక్టోబరు 17న శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని శ్రీజ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ నివృతి అనే కుమార్తె కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్‌ల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తడంతో వీరిద్దరు 2011విడిపోయారు. ఆ నెక్ట్స్ 2016 మార్చి 28న కల్యాణ్‌దేవ్ ( విజేత, సూపర్మచ్చీ చిత్రాల్లో హీరోగా నటించారు)తో శ్రిజ రెండో వివాహం జరిగింది. అయితే ఇటు కల్యాణ్ దేవ్‌కు ఇటు శ్రీజ..ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఇక ఈ ఇద్దరికీ 2018డిసెంబరు25న కుమార్తె నివిక్షకు జన్మ నిచ్చారు. అయితే ఇప్పుడు కల్యాణ్‌దేవ్, శ్రిజలు కూడా విడాకులు తీసుకోకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో శ్రీజ తన ఇన్స్టాగ్రామ్ ఐడీని శ్రీజ కొణిదెల (చిరంజీవి ఇంటిపేరు కొణిదెల అన్న సంగతి తెలిసిందే) కు మార్చడం ఇండస్ట్రీలో ఓ హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాదు..శ్రీజ, కల్యాణ్‌దేవ్‌లు విడాకులు ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అయిపోయాయని అందుకే శ్రీజ తన ప్రొఫైల్ ఐడీని మార్చి(శ్రీజకల్యాణ్ నుంచి శ్రీజ కొణిదెలకు మార్చారు) ఉంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్గా నాగచైతన్యతో విడాకులు తీసుకునే క్రమంలో సమంత కూడా ముందుగా తన సోషల్‌మీడియా అకౌంట్స్ల ఐడీలు మార్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఇండస్ట్రీలో ఇలా వరుసగా యంగ్ కపుల్స్ విడాకుల బారిన పడుతుండటం బాధకరమైన విషయం అంటున్నారు సినీ లవర్స్. మరోవైపు ఈ వార్త తెలిసిన మెగా అభిమానులు బాధపడుతున్నారు.
కళ్యాణ్ దేవ్ – శ్రీజ విడాకులు తీసుకోనున్నారా?
Leave a comment
Leave a comment