మలయాళ హీరో మోహన్‌లాల్ మనసు మార్చుకున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ విజువల్ గ్రాఫిక్స్ మలయాళ ఫిల్మ్ మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ చిత్రం థియే టర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్‌ను వాయిదా వేసుకున్న మరక్కర్ సినిమా ఫైనల్‌గా డిసెంబరు 2న థియేటర్స్‌లోకి రానుంది. ఇంతకుముందు ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఇక 67వ జాతీయ అవార్డుల వేడుకలో మరక్కర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కాస్ట్యూమ్ విభాగాల్లో అవార్డులును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం లక్కీసింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు మోహన్‌లాల్. ఇక మోహన్‌లాల్ నటించిన దృశ్యం 2, ట్వల్త్‌మ్యాన్, ఏలోన్ వంటి సినిమాలు ఓటీటీలో విడుదల కాను న్నయన్న తరుణంలో ఇప్పుడు మరక్కర్ థియేటర్ రిలీజ్‌కు రెడీ కావడం ఆయన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
మనసుకు మార్చుకున్న మోహన్‌లాల్
Leave a comment
Leave a comment