11 సంవత్సరాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ‘అతడు’(2005), ‘ఖలేజా’(2010) చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లోని మూవీ ఇది. ఎస్. రాధాకృష్ణ నిర్మాత. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తారు. ‘మహర్షి’ తర్వాత మళ్లీ మహేశ్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా ఈ చిత్రం కోసమే జోడీ కట్టారు. ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఏప్రిల్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేయాలను కుంటున్నారు. ఎప్పటిలాగానే మహేశ్‌బాబు ఈ ఓపెనింగ్‌కు హాజరుకాలేదు. ఈ సినిమా రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, ప్యాన్ ఇండియాగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మహేశ్‌బాబు. ఇక మహేశ్‌బాబు ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారువారిపాట’, చిత్రాలు మే 31న అంటే సూపర్‌స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ప్రారంభోత్సవాలు జరుపు కున్నాయి. కానీ మహేశ్ చేస్తున్న ఈ లేటెస్ట్ ఫిల్మ్ ఇందుకు విభిన్నంగా ఫిబ్రవరి 3న లాంచ్ కావడం విశేషం. అంటే గత మూడు సంవత్స రాలుగా మహేశ్ ఫాలో అవుతున్న సెంటిమెంట్ బ్రేక్ అయినట్లే…!
ప్రస్తుతం మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శ కత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఇక త్రివిక్రమ్, ‘సర్కారువారి పాట’ చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా సినిమా చేస్తారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధంచిన స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. 2024లో విడుదల చేయాలను కుంటున్నారు.