Kalki2898ad: ప్రభాస్ హీరోగా చేసిన ‘కల్కి2898ఏడీ’ (Kalki2898ad) సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినిమా లవర్స్. ఈ ఫ్యూచరిస్టిక్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మించారు. జూన్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ‘కల్కి2898ఏడీ’ సినిమా తొలి ట్రైలర్‌ను జూన్ 10న విడుదల చేశారు. ‘కల్కి2898ఏడీ’ ట్రైలర్ విజువల్‌గా అద్భుతంగా ఉంది. కానీ కథ అర్థంకాకుండ ట్రైలర్‌ను కట్ చేశారు నాగ్అశ్విన్.
Indian2: ఇండియన్ 2 కి ఇక్కట్లు!
అయితే ఇప్పుడు ‘కల్కి2898ఏడీ’ సినిమాను గురించిన మరో అంశంపై కూడా చర్చనీయాంశమైంది. అదేం టంటే…‘కల్కి2898ఏడీ’ సినిమా తొలి ట్రైలర్‌కు ఆశించినంత వ్యూస్ రాలేదు. ప్రభాస్ సినిమా ట్రైలర్ విడుదలైన, ప్రతిసారి 24 గంటల్లో ఇన్ని వ్యూస్ అంటూ కొత్త రికార్డ్స్ ఉండేవి. ఇప్పుడు ఈ విషయంలో కొత్త రికార్డ్స్ వ్యూస్ రాలేదు. పైగా కన్నడ ‘కల్కి2898ఏడీ’ ట్రైలర్‌కు అతి తక్కువ వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ గత చిత్రాలు ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘రాధేశ్యామ్’ల కంటే కూడా ‘కల్కి2898ఏడీ’కి 24 గంటలలోపు వచ్చిన వ్యూస్ తక్కువనే ప్రచారం సాగుతోంది.
‘కల్కి2898ఏడీ’ ట్రైలర్‌ను తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో విడుదల చేశారు.ఈ అన్ని భాషల్లో కలిపి ‘కల్కి2898ఏడీ’ ట్రైలర్‌కు 24 గంటల్లో 36 మిలియన్ వ్యూస్‌ను దక్కించుకుంది. అయితే ‘దేవర’ గ్లింప్స్‌కు 24 గంటల్లో 55 మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయని, ‘గుంటూరుకారం’ ట్రైలర్ కేవలం తెలుగులోనే విడుదలైనప్పటికీని దాదాపు 40 మిలియన్ వ్యూస్‌ను 24 గంటల్లో దక్కించుకుందని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. అంతేకాదు….ప్రభాస్ గత చిత్రాలు ‘సలార్: సీజ్ఫైర్’, ‘ఆదిపురుష్’ సినిమాల ట్రైలర్స్ వ్యూస్ కంటే కూడా 24 గంటల లోపల ‘కల్కి2898ఏడీ’ సినిమాకు వచ్చిన ట్రైలర్ వ్యూస్ తక్కువన్నది కొందరి నెటిజన్ల అభిప్రాయాలు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే. .‘కల్కి 2898ఏడీ’ తెలుగు ట్రైలర్ కన్నా (11 మిలియన్ వ్యూస్), హిందీ ట్రైలర్(14 మిలియన్ వ్యూస్)కు 24 గంటల లోపు వచ్చిన వ్యూస్ ఎక్కువని వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే చిత్రంయూనిట్ మరో ట్రైలర్‌ను విడుదల చేయనుందని, ఈ రిలీజ్ ట్రైలర్ సెన్సార్ కూడా పూర్తయిందని సమాచారం.
Kalki2898adtrailer:కల్కి2898ఏడీ ట్రైలర్ అదిరిపోయింది
ఈ సంగతి ఇలా ఉంచితే…ప్రభాస్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాకు ఓవర్సీస్లో అప్పుడే వన్ మిలియన్ బుకింగ్స్ రూపంలో వచ్చేసింది. ఇది మంచి శుభపరిణామం.
MegavsAllu: మరోసారి మెగా వర్సెస్ అల్లు అర్జున్?
‘కల్కి2898ఏడీ’ సినిమాలో దీపికాపదుకొనె, కమల్‌హాసన్, దిశాపటానీ, అమితాబ్‌బచ్చన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘కల్కి2898ఏడీ’ సినిమా మొత్తం తొమ్మిది భాగాలుగా విడుదల కానుందనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరకర్త.