SSMB29: హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ను విజయేంద్రప్రసాద్ పూర్తి చేశారు. మ్యూజిక్ వర్క్స్‌ను స్టార్ట్ చేశారు కీరవాణి. ప్రీప్రొడక్షన్ వర్క్స్‌ను తుదిదశకు చేర్చుతున్నారు రాజమౌళి. మహేశ్‌బాబు మేకోవర్ అవుతారు. ప్రస్తుతంలండన్లో ఉన్నాడు మహేశ్‌బాబు (SSMB29).
సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న మహేశ్‌బాబు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏదోఒకటి ఉంటుంది. కొన్నెళ్ళుగా ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. కానీ ఈ సారి మాత్రం ఈ సెంటిమెంట్‌ను మాత్రం రాజమౌళి బ్రేక్ చేశారు. మహేశ్‌బాబు తాజా సినిమాకు చెందిన ఏ అప్డేట్ మే 31న రాలేదు. దీంతో మహేశ్‌బాబు ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. ఇప్పుడు మహేశ్బర్త్ డే ఆగస్టు 9 రాబోతోంది. కొన్నేళ్ళుగా మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమా అప్డేట్స్ రావడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆగస్టు9న అయిన రాజమౌళి – మహేశ్‌బాబు కాంబినేషన్లోని సినిమా అప్డేట్స్ను ఊహిస్తున్నారు ప్రిన్స్ ఫ్యాన్స్. మరి..మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ను రాజమౌళి మళ్లీ బాధపెడతారా? లేక అప్డేట్స్తో ఖుషీ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
tollywood:ప్రీ ప్రొడక్షన్స్‌లోనే ఫ్లాప్!
ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని, ఒకేసారి రెండు పార్టులను చిత్రీకరించి, ఆరు నెలల గ్యాప్‌లో రెండు పార్టులు విడుదల అయ్యేలా ఆయన ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. 2026 చివర్లో ఈ సినిమా తొలిపార్టు విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయని భోగట్టా.