Rajamouli: కథ పెద్దగా ఉన్నప్పుడు సినిమా రెండు ముక్కలవుతుంది. ‘బాహుబలి’ సినిమా కథలా. రాజమౌళి తీసిన ‘బాహుబలి’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’గా విడుదలైంది. కానీ ఈ రెండు సినిమాల మధ్య రెండున్నర ఏళ్ల గ్యాప్ ఉంది.
‘బాహుబలి’ సినిమాకు దక్కిన పాన్ ఇండియా విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమిళ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ తీశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను మణిరత్నం చాలా తెలివిగా ప్లాన్ చేశాడు. ‘పొన్నియిన్‌సెల్వన్’ వంటి పెద్ద కథను ఒకే సినిమాగా చెప్పడం కష్టమని తన అనుభవంతో గ్రహించాడు మణిరత్నం. దీంతో వెంటనే ‘పొన్నియిన్ సెల్వన్’ను రెండు భాగాలుగా చేసేశాడు. కానీ రాజమౌళిలా ఒకపార్టు విడుద లైన తర్వాత మరోపార్టును తీయాలనుకోలేదు. ఒకేసారి రెండు పార్టులను చిత్రీకరించి, తొలిపార్టు విడు దలైన, ఆరు నెలల తర్వాత మలిపార్టును విడుదల చేశాడు. మిగతా భాషల్లో ఎలా ఉన్నా…తమిళనాడులో మాత్రం ‘పొన్నియిన్ సెల్వన్’కు మాత్రం మంచి ఆదరణే లభించింది.
SuriyaKanguva: లీకైనా కంగువా స్టోరీ…నిరాశలో సూర్య ఫ్యాన్స్?
ఆ తర్వాత మణిరత్నం ఫార్ములాను శంకర్ కూడా ఫాలో అయ్యారు. కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాలను ఒకేసారి చిత్రీకరించారు. ఇండియన్ 2 చిత్రం జూలై 12న విడుదల కానుంది. ‘ఇండియన్ 3’ సినిమాను ఆరు నెలల తర్వాత రిలీజ్ చేస్తామని ఆల్రెడీ శంకర్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు రాజమౌళి కూడా ఇలానే చేయాలనుకుంటున్నారు. మహేశ్‌బాబుతో రాజమౌళి ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సన్నా హాలు చేస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ‘మహారాజ’, ‘రాజకుమార’ వంటి టైటిల్స్ తెరపైకి వచ్చాయి.
Ramayana: రామాయణ.. ఆ ముగ్గురు అవుట్?
అలాగే ఈ సినిమాను రెండు భాగాలు తీయాలని రాజమౌళి భావిస్తు న్నారట. అంతేకాదు…రెండుపార్టులను ఒకేసారి చిత్రీకరించేసి, ఏడాది గ్యాప్‌లో రెండు పార్టులను విడుదల చేయాలన్నది రాజమౌళి ప్లాన్ అని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ఇలా మణిరత్నం, శంకర్ ఫార్మాట్లను ఫాలో అవుతున్నారు రాజమౌళి.
మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్లోని సినిమాను కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణంలో మహేశ్‌బాబు, రాజమౌళిలు కూడా పాలు పంచు కుంటారనే టాక్ వినిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయి సినిమా కాబట్టి ఓ బడా ఓటీటీ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపిస్తుందనే టాక్ ఆల్రెడీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.