తెలుగు చిత్రపరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు కె.విశ్వనాథ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ‘సిరిసిరి మువ్వ’, ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయంకృషి’, ‘స్వర్ణకమలం’, ‘అపద్భాందవుడు’, ‘శుభసంకల్పం’, ‘సప్తపది’..ఇలా ఎన్నో అద్భుతమైన ఆణి ముత్యాలను తెరకెక్కించిన అత్యంత ప్రతిభావంతులు దర్శక–నటులు, కళాతపస్పీ కె. విశ్వనాథ్.
అతంటి ప్రతిభావంతులైన ఆయన కె. విశ్వనాథ్‌గారు గురువారం (ఫిబ్రవరి 2) హైదాబాద్‌లో తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భాంతికి గురైంది.
కాశీనాథుని సుబ్రహ్మాణ్యం, కాశీనాథుని సరస్వతి దంపతులకు 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలోని రేపల్ల మండలంలో పెద పులివర్రు గ్రామంలో జన్మించారు కె. విశ్వనాథ్. ప్రాథమికవిద్యను అక్కడే అభ్యసించిన విశ్వనాథ్ ఇంటర్ చదువును మాత్రం గుంటూరులో పూర్తి చేశారు.
ఆ తర్వాత గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ(ఏసీ)లో బీఎస్సీ గ్రాడ్యూయేట్గా పట్టబద్రులైయ్యారు. కాగా, కె.విశ్వనాథుని కుటుంబం విజయవాడలో ఉంటే, ఆయన చదువు మాత్రంగుంటూరులో సాగింది.
చదువు పూర్తయ్యాక వాహినీ స్టూడియోలో సైండ్ రికార్డిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేశారు విశ్వనాథ్. అయితే విశ్వనాథ్ తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం వాహినీ పిక్చర్స్‌వారి ఉద్యోగి. తండ్రి వల్లే విశ్వనాథ్‌కు తొలిఉద్యోగం చేసే అవకాశం లభించిందనుకోవచ్చు. కానీ ఆయన ఎక్కువగా దర్శకత్వం వైపే మక్కువ చూపేవారు. 1951లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘పాతాళభైరవి’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఆయన, ఆ తర్వాత కొన్ని సినిమాలకు ఆడియోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘తోడికోడళ్లు’ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బా రావుతో కె.విశ్వనాథ్‌గారికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో ఆయన వద్ద సహాయ దర్శకుడిగా చేశారు కె. విశ్వనాథ్. ఆ తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘ఇద్దరుమిత్రులు’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి సినిమాలకు వర్క్ చేశారాయన. దీంతో కె.విశ్వనాథ్ ప్రతిభ అక్కినేని నాగేశ్వరరావు దగ్గరకి చేరింది. దీంతో తాను హీరోగా యాక్ట్ చేయబోయే ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడిగా కె.విశ్వనాథ్‌కు అవకాశం కల్పించారు అక్కినేని నాగేశ్వరరావు. దర్శకుడిగా తెరకెక్కించిన తొలి సినిమాయే కె. విశ్వనాథ్‌కు నంది అవార్డును తెచ్చిపెట్టింది. దీంతో కె. విశ్వనాథ్‌కు వరుస అవకాశాలు వచ్చాయి.


‘నేరము–శిక్ష’(1973), ‘జీవనజ్యోతి’(1975) చిత్రాల విజయాలు దర్శకునిగా కె.విశ్వనాథ్‌కు పేరుతెచ్చిపెట్టినప్పటికీని ఆయనకు మరింత పాపులారిటీనీ తీసుకు వచ్చిన చిత్రం మాత్రం 1976లో వచ్చిన‘సిరిసిరిమువ్వ’. ఈ చిత్రం తర్వాత కె. విశ్వనాథ్‌గారు వెనుతిరిగి చూసుకోలేదు. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరివెన్నెల’, ‘స్వయంకృషి’, ‘స్వర్ణకమలం’, ‘అపద్భాందవుడు’, ‘శుభసంకల్పం’, ‘సప్తపది’..ఇలా ఎన్నో సూపర్‌డూపర్ హిట్స్‌ను అందించారు. ఆయన దర్శకత్వంలోమొత్తం 51 చిత్రాలు రాగా, ఇందులో పది హిందీ చిత్రాలు ఉన్నాయి. ఈ పది హిందీ చిత్రాల్లో కూడాఅరడజను చిత్రాలు ఆయన దర్శకత్వంలో వచ్చి తెలుగులో సూపర్‌హిట్ సాధించిన చిత్రాలే కావడం
విశేషం. ఇటు యాక్టర్‌గాను పలు చిత్రాల్లో నటించారు కె. విశ్వనాథ్. ముఖ్యంగా ‘సంతోషం’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘కలిసుందాం రా’, ‘శుభసంకల్పం’ వంటి సినిమాల్లో కె.విశ్వనాథ్‌గారి నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే కమల్‌హాసన్, అర్జున్‌లు హీరోలుగా నటించిన ద్రోహి చిత్రంలోఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించారు.


స్వాతిముత్యం (1986), శ్రుతిలయలు(1987) సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా, శంకరాభరణం, శుభలేఖ చిత్రాలకు స్టోరీ రైటర్‌గా, సప్తపది చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్‌గా, శుభసంకల్పం చిత్రంలో బెస్ట్ యాక్టర్‌గా,కలిసుందాం రా చిత్రంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌గా ఆయనకు నంది అవార్డులు వరించాయి. స్వాతి ముత్యం, శ్రుతిలయలు, స్వరాభిషేకం, సప్తపది, శంకరాభరణం చిత్రాలు ఆయనకు జాతీయ అవార్డులను తెప్పిపెట్టాయి. కాగా 2017లో ఆయనకు దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారం లభించింది. ఇక స్వాతిముత్యం చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున ఆస్కార్ ఎంట్రీకి పంపిన నామినేషన్‌ను దక్కించుకోలేకపోయింది. ఇక విశ్వనాథ్‌కు భార్య జయలక్ష్మి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
కె.విశ్వనాథ్ మరణంతో తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా షాక్క లోనైంది. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ఆయను నివాళులు ఆర్పించారు.
Shocked beyond words!
Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023
Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM
— Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023