బాలకృష్ణకు ‘సింహా’, ‘లెజెండ్’ వంటి హిట్ సినిమాలను అందించిన దర్శకుడు బోయపాటి శీను 2021లో ‘అఖండ’ రూపంలో మరో బ్లాక్‌బస్టర్ మూవీని అందించాడు. 2021 డిసెంబరులో విడుదలైన ఈ సినిమాకు టాలీవుడ్‌లో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అప్పట్లో సినిమాటికెట్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీని సులభంగానే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది అఖండ. తెలుగులో
మిర్యాలరవీందర్ రెడ్డి నిర్మించిన అఖండ సినిమాను హిందీలో రీమేక్ కానున్నట్లుగా అప్పట్లో వార్తలు కూడావచ్చాయి. కానీ మారిన పరిస్థితులు, ఆడియన్స్ అభిరుచుల మేరకు అఖండ సినిమాను డబ్ చేసి హిందీథియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను హిందీలో రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ సంస్థఅఖండ సినిమాను హిందీలో రిలీజ్ చేస్తోంది. అఖండ సినిమా హిందీ రిలీజ్ జనవరి 20న కానుంది. ఆహా ఓటీటీలో బాలకృష్ట చేస్తున్న అన్‌స్టాపపబుల్ టాక్‌షోకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు అఖండ సినిమా హిందీలో కూడా హిట్ అయితే బాలయ్యకు టాలీవుడ్‌లో సూపర్‌హిట్టే. కానీ అఖండ సినిమాను హిందీ ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది చూడాలి.
ఇక గత ఏడాది పవన్‌కళ్యాణ్,రానాలు మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తెలుగు రీమేక్ ‘భీమ్లానాయక్’లో నటించారు. సాగర్ కె చంద్ర డైరెక్టర్. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమ కూర్చారు. అయితే సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మించిన భీమ్లానాయక్ సినిమాను అప్పట్లో ముందుగా తెలుగులో రిలీజ్ చేశారు.కానీ ప్రేక్షకుల నుంచి ఓ మోస్తారు ఆదరణ లభించింది. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయాలని సితార ఎంటర్‌టైన్మెంట్స్ వారు చేసినప్రయత్నాలు ఇప్పటికీ సఫలం కాలేదు. అయితే అయ్యప్పనుమ్ కోషియుమ్ హిందీ రీమేక్ రైట్స్ మాత్రం బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం దగ్గర ఉన్నాయి.
సేమ్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల..వైకుంఠపురములో.. సినిమా టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయాలనుకున్న ప్రయత్నాలు గట్టిగా జరిగాయి.కానీ కుదర్లేదు. అయితే ఇదే సినిమా హిందీలో కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కింది. ఈ ఏడాది థియేటర్స్‌లోకి వస్తుంది. ఇలా…పవన్, బన్నీ సినిమాలకు కుదరని హిట్ హిందీ రిలీజ్ బాలయ్యకు వర్కౌట్ అయ్యింది.