ప్రముఖ గాయని వాణీజయరాం (78) కన్నుమూశారు. దాదాపు 19 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడి సంగీత శ్రోతల మనస్సుల్లో స్థానం సంపా దించారు. ఆమె మరణంతో సంగీత ప్రపంచం ఒక్క క్షణం శబ్ధాన్నిఆపింది.
తమిళనాడులోని వేలూరులో 1945 నవంబరు 30న దొరైస్వామి, పద్మావతి దంపతులకు జన్మించారు వాణీ జయరాం. పదకొండుమంది సంతా నంలో ఆమె ఎనిమిదో సతానం. వాణీ జయరాం పది రోజుల బిడ్డగా ఉన్నప్పుడే నామాకరణం కోసం ఆమె తండ్రి ఓ సిద్ధాంతిని సంప్రదించగా, గొప్ప గాయకురాలు అవుతుందని చెప్పి, కలైవాణి అని పేరు పెట్టమని చెప్పారు ఆ సిద్ధాంతి. నాలుగోతరగతి వరకు వేలూరులోనే చదువుకున్నారు వాణీ జయరాం. పిల్లలకు సంగీతం నేర్పించాలనే ఉద్దేశ్యంతో దొరైస్వామి ఫ్యామిలీ చెన్నైకి వెళ్లారు.అక్కడ ఐదోతరగతిలో జాయిన్ అయ్యారు. అలాగే సంగీత విద్వాంసులు టి.ఆర్ బాలసుబ్రమణియన్, త్రివేండ్రం ఆర్ఎస్. మణిల దగ్గర శాస్త్రియ సంగీతం నేర్చుకునేందుకు సిద్ధం అయ్యారు వాణీ జయరాం.చురుకైన తెలివైన వాణీ జయరాం ఇటు చదువుల్లోనూ, అటు సంగీతంలోనూ త్వరితగతినే ప్రజ్ఞాపాఠవాలు చూపారు. స్కూల్ తరఫున పదేళ్ల వయసులోనే ఆమె ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడారు.ఇలా వాణీ సుస్వరగాత్రం తొలిసారి రేడియో ద్వారా సంగీత ప్రియుల దగ్గరికీ చేరింది.
మెల్లిగా సినిమా గాయని కావాలనుకున్నారు వాణీ జయరాం. కానీ కుటుంబం ఏమో సినిమాలంటే చిన్నచూపు. వారికి తెలిసింది ఒక్కటే. సంగీతం అంటే శాస్త్రీయ సంగీతం. సినిమా పాటలు పాడితేశాస్త్రీయ సంగీతాన్ని అవమానించినట్లేనని వారి భావన. కానీ వాణీజయరాంకు సినీ గాయని కావలనేది ఆమె స్వప్నం. దీంతో దొంగచాటుగా సినిమా పాటలు వినేవారు వాణీ జయరాం. ఇది ఇలాసాగుతుండగానే చెన్నైలోని క్వీన్స్ మేరీ కాలేజీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా పొందారు వాణీ జయరాం.కొలువు కోసం ప్రయత్నిస్తే చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం లభించింది. ఆ తర్వాతఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు బదలీ అయ్యారు వాణీజయరాం.
చదువు పూర్తయింది. ప్రభుత్వ కొలువు దక్కింది. దీంతో ఇంట్లోవారు వాణీకి పెళ్లి సంబంధాలు చూశారు.అప్పటికే ముంబైలోని ఓ మంచి ఉద్యోగం చేస్తున్న జయరాంతో వాణీ వివాహం హైదరాబాద్‌లోని సికింద్రబాద్‌లో జరిగింది. అయితే పెళ్లిన అయిన తర్వాత కూడా వాణీ జయరాం ఉద్యోగం మానలేదు. భర్తఉద్యోగం ముంబైలో కావడంతో ఆమెకు ముంబైకి బదిలీ చేయించుకున్నారు. వృత్తిరిత్యా ఉద్యోగం చేస్తున్నా జయరాం కూడా సంగీత ప్రియులే. పండిట్ రవిశంకర్ దగ్గర ఆరుసంవత్సరాల పాటు సితార్ నేర్చుకున్నారు జయరాం. సంగీతం పట్ల తనకూ మక్కువ, ప్రేమ ఉండటంతో భార్య వాణీ జయరాంను కూడాఅటువైపు ప్రొత్సహించాడు. శాస్త్రీయ, కర్ణాటిక్ సంగీతాల్లో ప్రావీణ్యత కనబరచిన వాణీ జయరాంకుఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ దగ్గర హిందూస్తానీ సంగీతాన్ని అభ్యసించవలసినదిగా వాణీ జయరాంనుకోరారు జయరాం. ఆరు నెలలు ఎంతో సాధన చేసి, హిందూస్తానీ సంగీతాన్ని నేర్చుకున్నారు జయరాం.ఇక కచేరీలు చేయవచ్చనే నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1969లో ముంబైలో తొలిసారి కచేరి ఇచ్చారు.
శాస్త్రీయ సంగీతం, కర్ణాటిక్ సంగీతం, హిందూస్తానీ సంగీతాలను నేర్చుకున్నారు కానీ సినిమా గాయని కావాలనుకున్న జయరాం స్వప్నం మాత్రం ఇంకా నేరవేరలేదు. ఆ అవకాశాన్ని ఆమె గురువుల్లో ఒకరైనఉస్తాద్ అబ్దుల్ రెహామాన్ కల్పించారు. వాణీ జయరాం కచేరీకి సంగీత దర్శకుడు వసంత్‌దేశాయ్ హాజరైయ్యారు. ఆమె గాత్రం ఆయనకు నచ్చింది. దీంతో వాణీ జయరాంను వసంతదేశాయ్ దర్శకుడు గుల్జార్‌కు పరిచయం చేశారు. వాణీతో గుల్జార్ మొదట మీరా భజన్స్ పాడించారు. నిజానికి వాణీ పాడిన పాటలురికార్డ్ కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత 1970లో హిందీ చిత్రం ‘గుడ్డీ’కి పాడే అవకాశాన్ని కల్పించారు వసంత్‌దేశాయ్. ధర్మేంద్ర, జయబాధురీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలోని ‘బోలే రే ..’తోపాటు మరో మూడు పాటలు పాడారు వాణీ జయరాం. వీటిలో ‘బోలే రే’ పాట సూపర్‌డూపర్‌హిట్.అంతే బాలీవుడ్ ఇండస్ట్రీలో వాణీ జయరాం రూపంలో మరో కొత్త గొంతు మారుమోగిపోయింది. ఇటు శ్రోతలు కూడా ముగ్దులైయ్యారు. ఈ పాటకు తాన్సేన్ అవార్డుతో పాటు మరో నాలుగు అవార్డులు వ వచ్చాయి. ఈ అవార్డులు ఆమెకు బోలెడన్నీ అవకాశాలను తెచ్చిపెట్టాయి. ఒక్కసారిగా బిజీ అయిపోయారు వాణీ జయరాం. ఇలా ఆర్డీ బర్మాన్, నౌషాద్, మదన్మోహన్, ఓపీ నయ్యర్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, పండిట్ రవిశంకర్ వంటి గొప్ప సంగీత దర్శకులతో వాణీ జయరాం వర్క్ చేశారు. మహహ్మద్‌రఫీ, కిశోర్‌కుమార్ వంటి గొప్ప గాయకులతో కలిసి పాటలు పాడారు. ముఖ్యంగా గుల్షాన్ దర్శకత్వంలో వచ్చిన ‘మీరా’ చిత్రంలోని 14 పాటలనూ ఆమె పాడారు. అప్పట్లో ఇదో సంచలనం.
హిందీలో గొప్పగాయనిగా పేరును తెచ్చుకున్నారు కానీ అవార్డులను తెచ్చుకోలేకపోయారు వాణీ జయ రాం. ఈ అవార్డులను ఆమెకు దక్షిణాది సినిమాలు అందించాయి. తెలుగు చిత్రం ‘అభిమానవంతుడు’లో ‘ఎప్పటివలే కాదురా స్వామి..’ అనే పాటను పాడే అవకాశం కల్పించారు ఎస్పీ కొదండపాణి. వాణీజయరాంకు తెలుగులో ఇదే తొలిపాట. కానీ ఆమెకు ‘పూజ’ చిత్రంలో పాటలు ద్వారా తెలుగులో మంచి పాపులారిటీ లభించింది. అయితే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’ చిత్రాల్లోని పాటలు ఆమెకు జాతీయ అవార్డులను తెచ్చిపెట్టాయి. అయితే తొలి జాతీయ అవార్డు వచ్చిందిమాత్రం తమిళ చిత్రం ‘అపూర్వ రాగంగళ్’ నుంచే. కమల్‌హాసన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కె.బాలచందర్ దర్శకుడు. ఇలా సౌత్‌లో కూడా వాణీజయరాం చాలా గొప్ప పాటలు పాడారు.
కేవలం సినిమా పాటలే కాదు…అదే స్థాయిలో భక్తి గీతాలు కూడా పాడారు వాణీ జయరాం.ముఖ్యంగా మీరా భజన్స్. చాలా కచేరీలు కూడా ఇచ్చారు. అయితే 2018లో వాణీ జయరాం భర్త జయరాం మర ణించడంతో ఆమె ఒంటరైపోయారు. చెన్నైలోని నుంగంబాక్కం హీడోస్ రోడ్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమె శనివారం మరణించారు. అయితే ఆమె శరీరానికి గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా పోలుసులు కేసు నమోదు చేశారు.