ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ సినిమాకు దర్శకుడు. మైథాలాజికల్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, జానకి (సీత) పాత్రలో కృతీసనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీసింగ్ కనిపిస్తారు. లంకేశ్ (రావణుడి) పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటి్స్తున్నారు. ఇప్పటికే రావణుడి పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశాడు. తాజాగా జానకి పాత్ర చేస్తున్న కృతీసనన్ షూటింగ్ పూర్తయింది. దీంతో ఇక ప్రభాస్ వంతు షూటింగ్ మాత్రమే మిగిలిఉంది. ఆదిపురుష్ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు.
ఇక మిగిలింది ప్రభాస్ వంతే!
Leave a comment
Leave a comment