కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ రొమ్-కామ్ గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకలో రామ్‌చరణ్ మాట్లాడుతూ, నేను అతిథిగా రాలేదు. నాన్నగారి దూతగా వచ్చాను. ఆయన ఆశీస్సులు తెలియపర్చడానికి వచ్చాను. యంగ్ నిర్మాతలు శ్రావ్య, సుధీర్ ఈ స్థాయికి చేరడం మామూలు విషయం కాదు. యంగ్ టెక్నికల్ టీమ్ పనిచేశారు. నగేష్ నేషనల్ అవార్డు విన్నర్. కెమెరామెన్, కీర్తి ఇలా ఇంతమంది కలిసి పనిచేయడం మామూలు విషయం కాదు. అందుకే వీరి కలయిలో సినిమా బాగుం టుంది. నా కాలేజీ డేస్‌లో నగేష్ గారి సినిమా చూశాను. మనం ఇప్పుడు ఓటీటీ చూసి ఎంజాయ్ చేస్తున్నామో నగేష్ గారు ఎప్పుడో అది ఓపెన్ చేశారు. ఇక్బాల్, హైదరాబాద్ బ్లూస్ వంటి సినిమాలు అందుకు నిదర్శనాలు. ఇక ఇంత మంది దిగ్గజాలు వుండగా చిన్న సినిమా కాదు. చాలా మీనింగ్ ఫుల్ సినిమా అని నాకు అనిపిస్తుంది. అందరికీ లైట్హౌస్గా దేవీశ్రీప్రసాద్ వున్నారు. రంగస్థలం, ఎవడు సినిమాలకు పనిచేశారు. సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడాలేదు. ఇప్పుడు ఏ బోర్డర్ లేకుండా ఇండియన్ సినిమా అని రాజమౌళి వల్ల పేరు తెచ్చుకుంది. ఇండియన్ సినిమాలో ఆడ, మగ కలిసి పనిచేస్తున్నారు. అందరూ ఒక్కటే. ఆది పినిశెట్టి రంగస్థలంలో మా అన్నగా చేశారు. ఎంతగానో ఆకట్టుకునే పలికించింది. ఇక మహానటిలో కీర్తి తపన నచ్చింది. అలా నేషనల్ అవార్డు దక్కించకోవడం గ్రేట్. ఇలాంటి కథలు మీరే చెప్పాలి. ఈనెల 28న సోలో రిలీజ్ దొరకడం మంచి విజయం చేకూరుతుందని భావిస్తున్నా. కీర్తి అభిమానులతోపాటు మా అభిమానులు కూడా సినిమా చూడండని పేర్కొన్నారు. అనంతరం మహా నటి కీర్తి కోసం ఆర్.ఆర్.ఆర్. లోని నాటునాటు.. సాంగ్‌ను రామ్ చరన్ తో కలిసి డాన్స్ చేసి అలరించారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ, మహానటి తర్వాత సైన్ చేసిన సినిమా ఇది. ఫన్ సినిమా చేయాలనిపించి గుడ్ లక్ సఖీ చేశా. దర్శకుడు, నిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు. కథ బాగా నచ్చింది. హైదరాబాద్ బ్లూస్.. ఆఫ్ బీట్ ఫిలిం. ఆ తర్వాత గుడ్ లక్ సఖితో నగేష్ గారు రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నా లుక్ నాచులర్‌గా వుంటుంది. మొదటిసారి సింక్ సౌండ్‌తో డైలాగ్ చెప్పాను. అలాగే కెమెరా చిరంతన్ దాస్ బాగా ఫోకస్ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతిఒక్కరినీ ధన్యావాదాలు. జగపతిబాబుగారితో ఎక్కువ సినిమాలు చేశాను. మంచి ఫ్రెండ్ కూడా. ఆది పినిశెట్టి గోల్ రాజుగా గుర్తు పెట్టుకుంటారు.రామ్ చరణ్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అభిమానుల ఉత్సాహంతోపాటు జైజై చరణ్ అంటూ ఉత్సాహపరిచారు.. రామ్ చరణ్‌గారి రంగస్థలం, తర్వాత ఆర్.ఆర్.ఆర్. వస్తోంది. అందులో నాటునాటు సాంగ్..
నా కేకాదు మా స్నేహితులకు బాగా నచ్చింది. సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అంటూ.. మీతో డాన్స్ చేయాలని నా డ్రీమ్ అని తెలిపారు. ఇక చిరంజీవిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. డి.ఎస్.పి.తో 5వ సినిమా చేశానని తెలిపారు.
చిత్ర దర్శకుడు నగేష్ కుకునూర్ మాట్లాడుతూ, 25 ఏళ్ళ ముందు హైదరాబాద్ బ్లూస్
సినిమా చేశాను. కానీ పూర్తి స్థాయిలో తెలుగు సినిమాకు ఇంత కాలం పట్టింది. ఈ సినిమా అంగీకరించడానికి కీర్తి వుందనే. ఆమె ఈ పాత్రను బాగా పోషించింది. ఇక జగపతిబాబు, ఆది పినిశెట్టి.. వీరందరితో పనిచేయడం ఆనందంగా వుంది. దేవీశ్రీప్రసాద్ చక్కటి బాణీలు కూర్చారు. కథగా చెప్పాలంటే పల్లెటూరిలో బంజార అమ్మాయి ఎలా షూటర్‌గా ఎదిగింది అనేది పాయింట్ ఈ సినిమా కె. విశ్వనాథ్, జంథ్యాల చిత్రాల స్పూర్తిగా తీసుకున్నట్లుగా వుంటుంది. టైటిల్ ప్రకారం అందరికీ గుడ్ లక్ అంటూ పేర్కొన్నారు.
చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర పదిరి, సహ నిర్మాత శ్రావ్య వర్మ , దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడి సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు.