శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలోని బైలింగ్వల్ ఫిల్మ్ ‘ఒకే ఒక జీవితం’ చిత్రం నుంచి ‘అమ్మా..వినమ్మా’ అనే సాంగ్ లిరికల్ వీడియో జనవరి 26న విడుదలైంది. అక్కినేని అఖిల్ ఈ సినిమాలోని ఈ పాట లిరికల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి, నాజర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రంలో హీరో శర్వానంద్, అక్కినేని అమల తల్లీకొడుకు పాత్రల్లో కనిపిస్తారు. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే…‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ డైరెక్టర్.