గాడ్‌ఫాదర్ సినిమా షూటింగ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు నయనతార. ఈ చిత్రం దర్శకుడు మోహన్‌రాజా
గాడ్‌ఫాదర్ సెట్స్‌లో నయనతార పాల్గొన్న ఫోటోను షేర్ చేశారు. లేడీ సూపర్‌స్టార్ నయనతారతో గాడ్‌ఫాదర్ చిత్రంలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. నయనతారతో వరుసగా మూడు చిత్రాలు చేయడం హ్యాపీగా ఉంది. తన్నీవరువన్(తెలుగులో రామ్‌చరణ్ ధృవ), శివకార్తికేయన్‌తో వెళ్ళైకారన్, చిరంజీవి గాడ్‌ఫాదర్ చిత్రాలలో నయనతార హీరోయిన్గా చేశారు
అని పేర్కొన్నారు
మోహన్‌రాజా.
ఇక గాఢ్‌పాదర్ విషయానికి వస్తే..చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు చేస్తున్నారు. సురేష్ సెల్వ రాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ గాడ్‌ఫాదర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మలయాళంలో హిట్సాధించిన `లూసీఫర్*
చిత్రానికి తెలుగు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ రూపుదిద్దుకుంటుంది. గాడ్‌ఫాదర్ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల
కానుంది. #Godfather