మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారువారిపాట’ చిత్రంలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పరశు రామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఫైనాన్షియర్‌ పాత్రలో మహేశ్‌బాబు, బ్యాంకు ఉద్యోగి కళావతి పాత్రలో కీర్తీసురేశ్‌ కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ స్పెయిన్‌లో జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కోసం స్పెయిన్‌ వెళ్లారు మహేశ్‌బాబు. ఆల్రెడీ మహేశ్‌బాబు స్పెయిన్‌కు వెళ్లారు. లేటెస్ట్‌గా కీర్తీసురేశ్‌ స్పెయిన్‌కు బయలుదేరారు. స్పెయిన్‌ షెడ్యూల్‌తో ‘సర్కారువారి పాట’ మేజర్‌ షూటింగ్‌ పూర్తి అవుతుంది. నవంబరు కల్లా ‘సర్కారువారిపాట’ షూటింగ్‌ను పూర్తి చేయాలనుకుంటున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్న
ట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. అయితే విడుదల తేదీ విషయంలో మార్పు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By Vissu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *