‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపుది ద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఆలియాభట్‌ను ఎంపిక చేసుకున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ముంబై మీడియా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆలియాభట్ ఒప్పుకున్నారు. ‘ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి అంగీకరించాను. ఈ చిత్రంలోని నా పాత్ర గురించి దర్శకుడు కొరటాల శివతో మాట్లాడాను. ఆయన చెప్పిన విధానం, నా క్యారెక్టర్ నచ్చాయి’’ అని క్లారిటీ ఇచ్చారు ఆలియా భట్. ఇక కల్యాణ్‌రామ్‌తో కలిసి మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఆలియాభట్ ఓ హీరో యిన్‌గా చేశారు. కానీ ఆలియాభట్ ఇందులో ఎన్టీఆర్‌కు పెయిర్ కాదు. ‘ఆర్ఆర్ఆర్’లో మరో హీరోగా చేసిన రామ్‌చరణ్‌కు పెయిర్. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టైమ్‌లోనే ఆలియాభట్‌ను తనతో సినిమా చేయాలని ఆమెను కోరగా ఆలియా అంగీకరించారని తెలిసింది.
ఇక సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన ‘గంగూబాయి కతియా వాడి’ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లుగా ఆలియా కన్ఫార్మ్ చేశారు. ఇక మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా రూపొందిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలో అజయ్ దేవగన్ ఓ కీ రోల్ చేయగా, హ్యూమాఖురేషీ ఓ అతిథి పాత్ర చేశారు.