‘నాంది’ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన అల్లరి నరేష్(Allari Naresh) మంచి జోరు మీద ఉన్నారు. వరుసగా నాలుగు సినిమాలకు సైన్ చేశారు. సాయి ధరంతేజ్ తో ‘సోలో బ్రతుకే సో బెటర్ ‘ తీసిన సుబ్బు డైరెక్షన్లో ‘అల్లరి’ నరేష్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అలాగే ‘జెండా’ అనే కథను సినిమాగా తీసేందుకు ‘అల్లరి’ నరేష్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఆయనే నిర్మిస్తారు.
అలాగే తనతో ‘నాంది’ ఉగ్రం’ సినిమాలను తీసిన దర్శకుడు విజయ్ కనకమెడలతో ‘అల్లరి’ నరేష్ మూడోసారి సినిమా చేయనున్నారు. ఈ సినిమా 2024లో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం అల్లరి నరేష్ పర్య అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా ఓ సినిమా ఉంది. అయితే సభకు నమస్కారం అనే పొలిటికల్ యాక్షన్థ్రిల్లర్ లో అల్లరి నరేష్ కి ఓ కమిట్ మెంట్ ఉంది. కానీఈ సినిమా నిర్మాత కోనేరు మహేష్ హార్ట్ ఎటాక్ తో మరణించడం తో ఈ చిత్రం ఆగిపోయింది.