రజనీకాంత్ (Rajinikanth )హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్’ (Jailer) . నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. రమ్యకృష్ణ, జాకీష్రాఫ్, తమన్నా, మిర్నా మీనన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, సునీ ల్ కీలక పాత్రలు పోషించారు. అనిరు«ద్ రవించందర్ సంగీతం అందించారు.కాగా ‘జైలర్’ సినిమాను ఆగస్టు 10న విడుదల చేస్తున్నట్లు చిత్రంయూనిట్ గురువారం అధికారికంగా ప్రకటించింది.
ఇక ‘జైలర్’కాకుండ ప్రస్తుతం ‘లాల్‌సలామ్’ సినిమా షూటింగ్‌లో నటిస్తున్నారు రజనీకాంత్. విక్రాంత్, విష్ణువిశాల్‌ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. ఇక హీరోగా రజనీకాంత్ నెక్ట్స్ ‘జైభీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలే కాకుండా కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనకరాజన్ డైరెక్షన్‌లో ఓ సినిమా, తెలుగు దర్శకుడు కేఎస్ రవీంద్ర(బాబీ)తో రజనీకాంత్ సినిమాలు కమిటైనట్లుగా వార్తలు వస్తున్నాయి.