హీరో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. పా. రంజి దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తంగలాన్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే 18 శతాబ్దంలో ‘కేజిఎఫ్’ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ చెన్నైలో ఆరంభమైంది.
ఈ షూటింగ్లో భాగంగా భారీ పోరాట సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. దర్శకుడు పా రంజిత్. అయితే ఈ యాక్షన్ సిక్వెన్స్ లో రిహార్సల్స్
లో భాగంగా విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పక్కటెముక విరిగినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు దీంతో తంగలాన్ సినిమాకు విక్రమ్ కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. కాగా విక్రమ్ గాయం నుంచి వీలైనంత తొందరగా కోలుకొని తంగలాన్ షూటింగ్లో జాయిన్ అవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Vikram : తీవ్రంగా గాయపడ్డ విక్రమ్
Leave a comment
Leave a comment