Fahadh Faasil: రాజమౌళి అంటే దర్శకుడే కాదు. తెలుగు సినిమాకు ఓ బ్రాండ్ అంబాసిడర్లాంటోడు. అలాంటి రాజమౌళి సమర్పకుడిగా చేసిన తొలి చిత్రం బాలీవుడ్ ‘బ్రహ్మాస్త్రం’. రణ్‌బీర్‌కపూర్, ఆలియాభట్‌లు హీరోలుగా నటించిన ఈ సినిమాకు కరణ్‌జోహార్ నిర్మాత. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లోని ఈ ట్రయాలజీ ఫిల్మ్‌లోని తొలిపార్టు 2022 సెప్టెంబరు 9న విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో విడుదలైంది. ‘బ్రహ్మాస్త్రం’ సినిమా దక్షిణాది రిలీజ్‌లకు రాజమౌళి ఓ సమర్ప కులుగా ఉన్నారు. ‘బాహుబలి’ సినిమాను కరణ్‌జోహార్ హిందీలో స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేశారు. ఆ సమయంలో రాజమౌళి డైరెక్షన్‌లోని ‘ఆర్ఆర్ఆర్’లో ఆలియాభట్ హీరోయిన్గా చేస్తు న్నారు. ఈ రెండు కారణాల చేత రాజమౌళి బ్రహ్మాస్త్రం సినిమాకు సమర్పకులుగా ఉండటానికి ఒప్పుకోని ఉండొచ్చు.
ఇప్పుడు ఫాహద్‌ఫాజిల్ తెలుగులో డైరెక్ట్ చేస్తున్న ‘ఆక్సిజన్(Oxygen)’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Dont Trouble the trouble)’ సినిమాలకు రాజమౌళి సమర్పకులుగా ఉన్నారు. బాహుబలి సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా, రాజమౌళి తనయుడు కార్తీకేయ ఈ సినిమాలకు నిర్మాతలు. కాబట్టి ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలకు రాజమౌళి సమర్పకులుగా ఉన్నారని ఊహించ వచ్చు. ‘ఆక్సిజన్’ సినిమాతో సిద్దార్థ్ నాదళ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో శశాంక్ ఏలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రెండు చిత్రాలు కూడా భవిష్యత్‌లో అమెజాన్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతాయి.