Ramcharan16: రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా (Ramcharan16) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పారంభోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా ప్రారంభోవత్సం రోజునే విడుదల చేస్తారనే టాక్ బలంగా వినిపించింది. ‘పెద్ది’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే టాక్ వినిపించింది. అయితే రామ్‌చరణ్ బర్త్ డే (మార్చి 27) సంద ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించాలని మేకర్స్ అనుకుంటున్నారు. అందుకే ప్రారంభోత్సవం రోజున ఈ సినిమా టైటల్‌ను చెప్పలేదట మేకర్స్. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక రామ్‌చరణ్ హీరోగా నటించిన మరో చిత్రం ‘గేమ్‌చేంజర్’ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. శంకర్ దర్శకుడు. అవినీతి లేకుండా ఎలక్షన్స్‌ను నిర్వహించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ రామ్నందన్ కథే ఈ చిత్రం. రామ్‌చరణ్ డ్యూయోల్ రోల్. ప్లాష్‌బ్యాక్‌లో అప్పన్న పాత్రలో కనిపిస్తారని తెలిసింది. రాజమండ్రిలో ఉండే
ఎసిపోడ్ ఇది. తండ్రి పాత్ర అప్పన్నకు అంజలి, రామ్నందన్కు జోడీగా కియారా అద్వానీ కనిపిస్తారు. ‘దిల్’ రాజు, జీ స్టూడియోస్, శిరీష్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుచ్చిబాబుతో చేసే సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత సుకుమార్‌తో మరో సినిమాను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు రామ్‌చరణ్. గతంలో రామ్‌చరణ్–సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.