మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓటీటీలో చేయనున్న తొలి సిరీస్‌కు ‘గన్స్ అండ్ గులాబ్స్’ అనే టైటిల్ ఖరారైంది. ‘ది ఫ్యామిలీమ్యాన్’ సిరీస్ ద్వయం రాజ్ అండ్ డీకే ఈ ‘గన్స్ అండ్ గులాబ్స్’కు దర్శకత్వం వహిస్తారు. ఇందులో దుల్కర్‌తో పాటుగా రాజ్‌కుమార్‌రావు, ఆదర్శ్ గోరవ్ ఇతర ముఖ్య తారాగణం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ‘సినిమాబండి’ (నిర్మాతలుగా) సక్సెస్ తర్వాత బాడా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌కు రాజ్ అండ్ డీకే కమిటైన రెండో ప్రాజెక్ట్ ఇది. దర్శకత్వం పరంగా నెట్‌ఫ్లిక్స్‌కు రాజ్ అండ్ డీకే చేస్తున్న తొలి ప్రాజెక్ట్ ‘గన్స్ అండ్ గులాబ్స్’. ఇక ప్రస్తుతం మలయాళంలో చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న దుల్కర్సల్మాన్ ప్రజెంట్ తెలుగులో హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ ్రస్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేస్తోన్న సంగతితెలిసిందే.
గన్స్ అండ్ గులాబ్స్
Leave a comment
Leave a comment