బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ జీవితం డాక్యూమెంటరీగా రానుంది. ‘బియాండ్ ది స్టార్: సల్మాన్‌ఖాన్’ టైటిల్‌తో ఈ డాక్యూమెంటరీ రూపొందుతుంది. దీనికి విరఫ్ సర్కారి దర్శకత్వం వహిస్తున్నట్లుగా బాలీవుడ్ సమాచారం. ఇందుకు తగ్గ షూటింగ్ పనులు ఆల్రెడీ ముంబైలో మొదలైపోయాయి. షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ డాక్యూ మెంటరీలో సల్మాన్ ఖాన్ జీవితంలోని ముఖ్య సంఘటనలు, సినిమా విశేషాలు ఉంటాయి. అయితే సల్మాన్ జీవితంలో హిట్ అండ్ రన్ కేసు వివాదం, బాలీవుడ్ కథానాయికలతో ప్రేమాయాణాలు ఇలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. వీటిని విరఫ్ ఎలా చూపించ నున్నారనేది బాలీవుడ్‌లో ప్రజెంట్ ఓ హాట్ టాపిక్. ఇక ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ ‘టైగర్ 3’, ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.

