బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్, అతని తండ్రి నటుడు -దర్శకుడు రాకేష్ రోషన్ ల కాంబినేషన్లో వచ్చిన క్రిష్ ఫ్రాంచేజ్ కి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది అయితే ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. క్రిష్ 4 సినిమాను 2016లో ప్రకటించారు. అలాగే 2018లో క్రిస్మస్ సందర్భంగా క్రిష్ 4ను రిలీజ్ చేస్తామని అప్పట్లో దర్శకుడు రాకేష్ రోషన్ ప్రకటించారు కానీ ఈ సినిమా అప్పటి నుంచి వాయిదా పడుతూనే ఉంది ముఖ్యంగా రాకేష్ రోషన్ క్యాన్సర్ బారిన పడటం, ఆయన కొలుకోవడానికి మరింత సమయం పట్టడం క్రిష్4 సినిమా రాకను మరింత ఆలస్యం చేసింది .
రాకేష్ రోషన్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని క్రిష్ 4 సినిమాకు ఆయనను దర్శకుడిగా తప్పించారు హృతిక్ రోషన్ అయితే ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేయనున్నారు. కానీ క్రిష్ ఫ్రాంచేజ్ కిసంబంధించిన స్క్రిప్స్ పై రాకేష్ రోషన్‌కు మంచి పట్టు ఉంది కాబట్టి క్రిష్ 4 సినికు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు.
ఒక దశలో క్రిష్ 4 సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది హృతిక్ రోషన్‌తో ఇప్పటికే ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ వంటి సక్సెస్ఫుల్ సినిమాలను తీసిన సిద్ధార్థ ఆనంద్ ప్రస్తుతం ‘ఫైటర్’ అనే సినిమా తీస్తున్నారు .ఈ సినిమా 2024 జనవరి 25న విడుదల కానుంది .హృతిక్ రోషన్ తో తక్కువ సమయంలోనే మూడు సినిమాలను తీయడంతో క్రిష్ 4 కి కూడా ఆయనే దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్ వాసులు ఊహించారు. అయితే సిద్ధార్థ ఆనందుకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఆయన క్రిష్ 4కు దర్శకత్వం వహించటం లేదు. కానీ క్రిష్ 4 సినిమాకు ఆయన ఓ నిర్మాత గా భాగస్వామ్యులయ్యారు.
వచ్చే ఏడాది క్రిష్ 4 సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. ఫైటర్ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత ‘వార్ 2’ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతారు హృతిక్ రోషన్ ఈ సినిమా మేజర్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత క్రిష్ ఫోర్ రెగ్యులర్ షూటింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు హృతిక్ రోషన్.