సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్లో ‘మోసగాళ్లకు మోసగాడు’(Mosagallaku Mosagadu) సినిమా సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల జంటగా కృష్ణ సోదరుడు, నిర్మాత జి.ఆదిశేషగిరిరావు నిర్మించినచిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. 1971లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ అడించింది. చెప్పాలంటే తెలుగు తెరకు హాలీవుడ్ హంగులు అద్దింది ఈ సినిమాయే. ఇండియన్ ఫస్ట్ కౌబాయ్సినిమాగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమానే చెప్పుకుంటారు. ఈ సినిమా కోసం సూపర్‌స్టార్ కృష్ణకొత్త టెక్నాలజీని వాడటం అప్పట్లో సంచలనంగా మారింది.
కాగా ‘మెసగాళ్లకు మోసగాడు’ సినిమాను సూపర్‌కృష్ణ జయంతి సందర్భంగా మే 31, 2023న రి రిలీజ్ చేస్తున్నట్లు ఈ చిత్రం నిర్మాత జి. ఆదిశేషగిరిరావు వెల్లడించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ–‘‘రామరావు,నాగేశ్వరరావుల స్థాయికి కృష్ణగారిని తీసుకుని వెళ్లాలని పద్మాలయ స్టూడియోను స్థాపించాము. కృష్ణ బర్త్ డేకి ఘన నివాళిగా, అభిమానుల కోరిక మేరకు మోసగాళ్ళకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాం. సాంకేతిక పరంగా ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను మెరుగుపరచాము. ‘అల్లూరిసీతరామరాజు’( మే 1, 197లో రిలీజ్) సినిమా విడుదలై నేటికి 49 సంవత్సరాలు పూర్తయింది. అందుకే ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను రి రిలీజ్ చేస్తున్న విషయాలను ప్రకటించాము. మే 31న కృష్ణగారి బర్త్ డే రోజున ఆయన అభిమానుల సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలను కూడ ప్లాన్ చేసాము ” అని చెప్పుకొచ్చారు.
ఇక 1943 మే 31 బుర్రిపాలెంలో జన్మించిన కృష్ణ ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి, తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి, సేవ చేసి 2022 నవంబరు 15న స్వర్గస్తులైయ్యారు.