Dhanush D50 Raayan: ధనుష్ హీరోగా నటించిన 50వ సినిమాకు ‘రాయన్’ (Dhanush D50 Raayan) టైటిల్ ఖరారైంది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు ధనుస్ స్వీయదర్శకత్వం వహించారు. ‘పా.పాండి’ తర్వాత ధనుష్ దర్శకత్వంలో రూపొందినరెండో సినిమా ఇది. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో ధనుష్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. అందులో ఒకటి గుండు గెటప్‌లో ధనుష్ కనిపిస్తారు.ముగ్గురు అన్నదమ్ముల మధ్య సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ‘రాయన్’ ఉంటుందని కోలీవుడ్‌లో వార్తలు వస్తు న్నాయి. ఈ సినిమాలో సందీప్‌కిషన్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్ చేశారు. నిత్యామీనన్, అనిఖా సురేంద్రన్, అపర్ణాబాలమురళి ఈ సినిమాలో కీ రోల్స్ చేశారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను ఈ ఏడాదే విడు దల చేయాలనుకుంటున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.
#D50 is #Raayan 🔥
🎬 Written & Directed by @dhanushkraja
🎵 Music by @arrahman
Releasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/7QPUxZTtNq
— TollywoodHub (@tollywoodhub8) February 19, 2024
ఇక తన డైరెక్షన్‌లోని రెండో సినిమా 2019లోనే రావాల్సింది. కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీంతో ‘రాయన్’ను స్టార్ట్ చేశారు ధనుష్. అంతేకాదు..ధనుష్ డైరెక్షన్‌లోని రెండో సినిమా ‘రాయన్’ విడుదల కాకముందే అతని డైరెక్షన్‌లోని మూడో సినిమా ‘నిలవుక్కు ఎమెల్ ఎన్నడి కోబమ్’(Nilavukku Enmel Ennadi Kobam) ( తెలుగులో చంద మామకు నాపై కోపం ఎందుకో అని మీనింగ్) షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమాలో ధనుష్ యాక్ట్చేయడం లేదు. కేవలం డైరెక్షన్ మాత్రమే చేస్తున్నారు. గెస్ట్ రోల్ ఉంటే ఉండొచ్చు. మాథ్యూ థామప్, ప్రియా ప్రకాష్‌వారియర్, అనిఖాసురేంద్రన్, రబియా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ధనుష్ నిర్మాణసంస్థ వుండర్ బార్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
#DD3 is titled as "Nilavukku Enmel Ennadi Kobam" A usual love story ♥️ Here's the motion poster 😍#Neek #Dhanush #GVPrakash@dhanushkraja @gvprakash @theSreyas pic.twitter.com/aJeA1GR1Np
— Wunderbar Films (@wunderbarfilms) December 24, 2023
ఇక యాక్టర్‌గా ధనుష్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో శేఖర్ కమ్ములతో చేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ధారావి’ (ప్రచారంలో ఉన్న టైటిల్) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నాగార్జున ఇందులోఓ కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే తమిళంలో నాలుగు, హిందీ ఒక సినిమాకు ధనుష్ కమిటైయ్యారు.