ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘కెప్టెన్ మిల్లర్’ ఒకటి. 1930-1940 పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సందీప్‌కిషన్, శివరాజ్‌కుమార్, నివేదితా సతీష్ కీలక పాత్రలు పోషి స్తున్నారు. జూలై 28న ధనుష్ బర్త్ డే సందర్భంగా ‘కెప్టన్ మిల్లర్’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హంతకుడిగా, బందిపోటుగా ముద్రపడిన కెప్టెన్ మిల్లర్ కథ ఏమిటి? అనేది ఈ సినిమా కథాంశం. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. ఓ వ్యక్తి ప్రయాణంగా ఈ సినిమా కథనం సాగుతున్నట్లుగా తెలుస్తోంది. సత్యజ్యోతి ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 15న థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఈ సినిమా కాకుండా ధనుష్ తెలుగులో దర్శకుడు శేఖర్‌కమ్ములతో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ధనుష్ బర్త్ డే సందర్భంగానే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సమాజంలో నెలకొన్న అసమానతల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలే కాకుండా ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ధనుష్ కెరీర్ ఇది 50వ సినిమా. అలాగే ధనుష్ దర్శకత్వంలో రెండోవది. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. ‘కర్ణన్’ తర్వాత మారి సెల్వరాజ్దర్శకత్వంలో మరో సినిమాకు ధనుష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. హిందీలో ఆనంద్ ఎల్.రాయ్ డైరెక్షన్లో ఓ మూవీకి ధనుష్ కమి టైన విషయం విదితమే. అలాగే ‘యుగానికి ఒక్కడు’ సినిమా సీక్వెల్‌ను ధనుష్‌తో తెరకెక్కించనున్నట్లుగా ఆ చిత్రం దర్శకుడు సెల్వరాఘవన్ ప్రకటించారు. కానీ ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు.