చిరంజీవి హీరోగా నటించిన ‘భోళాశంకర్’ (Chiranjeevi BholaShankar) సినిమా ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ సోషల్‌మీడియాలో విడుదల చేశారు. మెగా అభిమానులకు ఈ ట్రైలర్ బాగా నచ్చేలా ఉంది. మోహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీసురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. తమిళంలో విజయం సాధించిన అజిత్ వేదాళంకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 11న ‘భోళాశంకర్’ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
చిరంజీవి తర్వాతి సినిమాపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది. దర్శకులు కల్యాణ్‌కృష్ణ, అనిల్ రావిపూడి, బీవీఎస్ రవి, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠలు చిరంజీవికి కథలు విని పించారు. మరి.ఘే దర్శకుడితో చిరంజీవి సినిమా చేస్తారో చూడాలంటే వేచి ఉండాలి. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన తర్వాతి చిత్రం గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.