బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ (TSeries) భూషణ్ కుమార్(BhushanKumar) తెలుగు సినిమాల నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆది పురుష్’, హీరోగా నటించాల్సిన ‘స్పిరిట్’ సినిమాల నిర్మాణంలో టి సిరీస్ భాగస్వామి. అలాగే అల్లు అర్జున్ తోనూ టి సిరీస్ ఓ సినిమాను నిర్మిస్తుంది. ప్రభాస్ స్పిరిట్ అల్లు అర్జున్ సినిమాలకు దర్శకుడు ఒకటే ఆయనే ‘అర్జున్ రెడ్డి ‘ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ.
పై సినిమాలతో పాటు తాజాగా టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘పుష్ప: ది రూల్’ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యంలో కానున్నట్లుగా బాలీవుడ్ సమాచారం. ఇందుకు సంబంధించిన చర్చోప చర్చలు కూడా పూర్తయ్యాయి అన్నది బీ టౌన్ టాక్. ‘పుష్ప ‘సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని ,వై రవిశంకర్లపై ఐటి దాడులు జరిగిన నేపథ్యంలో ….’పుష్ప2’ సినిమా వేగవంతం కావడానికి భూషణ్ కుమార్ ను సుకుమార్ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పుష్ప దిధుల్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. బ్యాంకాంగ్ యూరప్ లొకేషన్స్ లో పుష్ప టు చిత్రీకరణను ప్లాన్ చేశారు పుష్ప సినిమాలో ఎక్కువగా మలేషియా లొకేషన్స్ ఉంటాయని సమాచారం. కాగా ఈ విషయాలపై పూర్తి అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమాలోని మల్లి పార్ట్ పుష్ప దిర్రుల్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, సునీల్ అనసూయ, జగపతిబాబు కీలక పాత్రధారులు. 2024 లో ఈ సినిమా విడుదల కానుంది.