Prabhas Adipurush ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ఆదిపురుష్ (Adipurush). రామాయణం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, హనుమంతుడిగా దేవ్ దత్తా నటించారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ పౌరాణిక చిత్రాన్నితెరకెక్కించారు. భూషణ్‌కుమార్, క్రషణ్‌కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం జూన్ 16న థియేటర్స్‌లో విడుదల కానుంది. కాగా శనివారం అక్షయతృతియను పురష్కరించుకుని ‘ఆది పురుష్’ చిత్రంలోని ‘జై శ్రీరామ్’ లిరికల్ సాంగ్ వీడియోనురిలీజ్ చేశారు. ఈ వీడియో 60 సెకన్ల పాటు ఉంటుంది. ఐదు భాషల్లో ఈ జై శ్రీరామ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అజయ్, అతుల్ ఆదిపురుష్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
Adipurush: ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుంచి జై శ్రీరామ్ లిరికల్ వీడియో విడుదల
Leave a comment
Leave a comment