బాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ బడా నిర్మాత కరణ్ జోహార్ (Karanjohar) తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఒక యాక్టర్ సమయపాలన మైంటైన్ చేయకపోవడం జోహార్ హార్ట్ కావడానికి కారణంగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సుదీర్ఘమైన ఓ పోస్ట్ ను తన ఇంకా రామ్ అకౌంట్లో షేర్ చేశారు కామెంట్ జోహార్.
సమయపాలనను పాటించడానికి ప్రత్యేకమైన ప్రతిభ ఏం అవసరం లేదు. ఎందుకు పెద్దగా చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది వారసత్వ సంపద కాదు. తోటి వారికి సమయానికి మనం ఇచ్చే గౌరవం అలాగే వారికి కూడా. 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చి కూడా కనీసం ఒక క్షమాపణ చెప్పాలని కూడా వాళ్లకి లేకపోవటం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.
మీరు బిజీగా ఉండడానికి మీరు ఓ దేశ అధ్యక్షుడు ఏం కాదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పకండి. భారతదేశంలో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే జనాభా కాబట్టి కానీ సమయానికి చేరు కోవాలని ఉద్దేశంతో మనమే ముందుగా బయలుదేరాలి. అంతేగాని ఉన్న సమస్యలను సాకుగా చూపి నా వైపు అంత సవ్యంగానే ఉందని చెప్పే ప్రయత్నం చేయకూడదు. అంటే ఇలా లాంగ్ పోస్టును కరెంట్ జోహార్ షేర్ చేశారు.
https://www.instagram.com/p/CrrEmnFo33X/
అయితే కరణ్ జోహార్ ఇంతలా హర్ట్ అవ్వడానికి గల కారణం ఏమిటి? ఆయన్ను ఇంతలా ఇబ్బంది పెట్టినహీరోయిన్ ఎవరు? అనే చర్చ బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్‌టాపిక్. అలాగే అలం జోహార్ ఈ లాంగ్ పోస్టును షేర్ చేసిన తర్వాత ఆయన మనోభావాలు దెబ్బతినేలా ఎవరు ప్రవర్తించారో వారి పేరును కూడా వ్యక్త పరచాలని కొందరు నేటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కరణ్‌జోహార్ ప్రస్తుతం రణ్‌వీర్‌సింగ్, ఆలియాభట్ల ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ దర్శకత్వం వహించారు. షాహిద్‌కపూర్, దిశాపటానీ, రాశీఖన్నాల ‘యోధ’, రాజ్కుమార్రాజ్, జాన్వీకపూర్ల ‘మిస్టర్ అండ్ మిసెసె మహి’, అజయ్‌దేవగన్, దీపికా పదుకొనె ‘సింగమ్ ఎగైన్’ చిత్రాలను నిర్మించారు.