Sanjay dutt: సంజు బాబాకు తీవ్ర గాయాలు..స్పందించిన సంజయ్‌దత్
April 13, 2023
Updated 2023/04/13 at 10:51 AM
Share
1 Min Read
Sanjaydutt
SHARE
Sanjay dutt: కన్నడ హీరో ధృవా సర్జా, దర్శకుడు ప్రేమ్ జోగి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ ‘కేడీ: ది డెవిల్’. ఈ సినిమాలో సంజయ్‌దత్, శిల్పాశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా సంజయ్‌దత్ తీవ్రంగా గాయాలాపాలైయ్యారని, చికిత్స నిమిత్తం వెంటనే ముంబైకి వెళ్లారనే టాక్ వినిపించింది. దీంతోఘీ విషయంపై సంజుబాబా స్పం దించారు. తనకు ఎలాంటి గాయాలు కాలేదని, క్షేమంగానే ‘కేడీ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటు న్నాని సోషల్‌మీడియాలో స్పందించారు సంజయ్‌దత్. అలాగే ఈసినిమాలోని తన సన్నివేశాల కోసం చిత్రంయూనిట్ ప్రత్యేక చర్యలు తీసుకుటుందని కూడా సంజయ్‌దత్ వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.