‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. శతమానం భవతి, హలో గురూ ప్రేమ కోసమే వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘బటర్ ఫ్లై’.
జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై గంటా సతీష్ బాబు దర్శకత్వంలో రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 18) అనుపమ పరమేశ్వరన్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ను గమనిస్తే చేతులు కట్టుకుని నిలబడిన అనుపమ, ఏదో విషయం గురించి ఆలోచిస్తుంది. ఆమె వెనుక సీతాకోక చిలుక రెక్కలున్నాయి. ఆ రెక్కల్లో అందమైన రంగులను మనం గమనించవచ్చు. ఇటు యువత, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
అరవింద్ షారోన్ (అర్విజ్), గిడోన్ కట్టా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
అనుపమ పరమేశ్వరన్ నెక్ట్స్ మూవీ ‘బటర్ ఫ్లై’
Leave a comment
Leave a comment