Alia Bhatt’s Gangubai Kathiawadi
బాలీవుడ్లో టాప్ హీరోయిన్ ఆలియాభట్, టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్లోని ‘గంగుబాయ్ కతియావాడి’ సినిమా ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల విషయంలోని కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. గత ఏడాది రిలీజ్డేట్స్ను పక్కన పెడితే.. 2022లోనే ఈ సినిమాకు సంబంధించి మూడు రిలీజ్ డేట్స్ వచ్చాయి. జనవరి 7న, ఫిబ్రవరి 4న లేటెస్ట్గా ఫిబ్రవరి 25న ఈ సినిమా విడుదల డేట్స్ వచ్చాయి. జనవరి 28న ఈ సినిమాను ఫిబ్రవరి25 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి..ఈ సారైనా ఈ చిత్రం థియేటర్స్‌కు అనుకున్న తేదీకి వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. అనుకోకుండ ఇష్టం లేకపోయిన ఓ యువతి వేశ్యగా మారాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమెకు గంగుబాయి అనే పేరు ఎలా, ఎందుకు వచ్చింది? ఆమె జీవితం ఏ పరిస్థితుల ఆధారంగా ప్రభావితం కాబడినది అన్న అంశాల నేపథ్యంలో గంగుబాయి కతియావాడి చిత్రం ఉంటుంది. కామటిపురకు చెందిన ఓ మహిళ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో అజయ్‌దేవగన్ ఓ కీ రోల్ చేశారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు జరగనున్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘గంగుబాయి కతియావాడి’ స్క్రీనింగ్ కానుంది.