అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న అరడజనుకుపైగా సినిమాల్లో ‘బచ్చన్‌పాండే’ ఒకటి. ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 18న విడుదల చేయనున్నట్లు కొత్త లుక్ పోస్టర్స్‌తో అధికారికంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు హీరో అక్షయ్‌కుమార్. ఫర్హాద్సామ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతీసనన్ హీరోయిన్స్‌గా నటించారు. అయితే మార్చి 18న తెలుగులో వరుణ్‌తేజ్ నటించిన ‘గని’ చిత్రం విడుదల కానుంది. ఇది తెలుగు చిత్రం కాబట్టి అక్షయ్‌కుమార్ హిందీ చిత్రం ‘బచ్చన్‌పాండే’తో ‘గని’కి వచ్చిన ఇబ్బందులు ఏమీ లేవు. కానీ ప్రభాస్ లేటెస్ట్ ప్యాన్‌ఇండియన్ మూవీ ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని మార్చి 18న విడుదల చేయాల నుకుంటున్నారు. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇదే తేదీని ఆల్మోస్ట్ ఫిక్సయ్యారు మేకర్స్. ఈ తరు
ణంలో అక్షయ్‌కుమార్ ‘బచ్చన్పాడే’ రిలీజ్ మార్చి 18న అని రావడం ప్రభాస్ అండ్ కోకు షాకే అని చెప్ప వచ్చు. ప్రభాస్‌కు ఎంత మార్కెట్ ఉన్నా..బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ చాలా పాపులర్. పైగా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇందువల్ల మార్చి 18నే రాధేశ్యామ్ టీమ్ రావాలనుకుంటే మాత్రం థియేటర్స్ తక్కువగా లభించే అవకావం ఉంది. ఇక అక్షయ్‌కుమార్ బచ్చన్‌పాండే చిత్రం తమిళంలో వచ్చిన ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్ అనే ప్రచారం సాగుతోంది. జిగర్తాండ తెలుగులో వాల్మీకిగా వచ్చిన విషయం తెలిసిందే.
అక్షయ్‌కుమార్ బచ్చన్ పాండే రిలీజ్ ఖరారు..టెన్షన్లో ప్రభాస్ ఫ్యాన్స్
Leave a comment
Leave a comment