‘మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) సభ్యత్వానికి నటుడు ప్రకాశ్‌రాజ్ రాజీనామా ఇచ్చారు. ‘మా’ ఎన్నికల్లో ప్రాంతీయవాదం, జాతీయవాదం అంశాలను తెరపైకి తీసుకురావడం బాధించిందని ప్రకాశ్‌రాజ్ అన్నారు. తన తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం తన తప్పు కాదనీ ..అది తన తప్పు కాదుని అన్నారు. అందుకే 21 సంవత్సరాలుగా ఉన్న నా ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. సభ్యత్వానికే రాజీమానా చేశానని, తెలుగు సినిమాలను వదులుకోవాలనుకోవడం లేదని ప్రకాశ్రాజ్అన్నారు. తెలుగు పరిశ్రమలో అతిథిగా ఉండమన్నారు. అలాగే ఉంటానని, ఇలాంటి ఏజెండా ఉన్న ‘మా’ అసోసియేషన్‌లో ఉండలేనని కూడా ఆయన స్పష్టం చేశారు. తెలుగువారు కానీ వారు ‘మా’ ఎలక్షన్స్‌లో పోటీ చేయకూడదన్న విధంగా ‘మా’ బైలాస్ మార్చుతామన్న విష్ణు మాటలను ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్
గుర్తుచేశారు. ఆత్మగౌరవంతో తాను రాజీనామా చేస్తున్నానని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎలక్షన్స్‌లో ,మా ఎలక్షన్స్‌లో నేను నేనుగా ఉండటం వల్లే ఓడిపోయాను. ఎన్నికల్లో నా ఓటమికారణాలను విశ్లేషించు కుంటాను. ‘మా’ సభ్యులు తెలుగువారే కావాలని తెలుగుబిడ్డ విష్ణును ఎంచుకున్నారని ప్రకాశ్‌రాజ్ అన్నారు. అసోసియేషన్‌లో ఉండి కాదు..బయట నుంచి ఉండి పనిచేస్తాను.
నా తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం నా తప్పు కాదన్న ప్రకాశ్‌రాజ్…‘మా’లో తన ఓటమిపై స్పందించిన ప్రకాశ్‌రాజ్.
Leave a comment
Leave a comment