ఇటీవల నాగచైతన్యతో వివాహసంబంధానికి సమంత ఫుల్స్టాప్ పెట్టారు. దీంతో ఇప్పుడు తన సినీ కెరీర్‌పై ఆమె ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ‘శాకుంతలం’, ‘కాదువాక్కుల రెండు కాదల్’ సినిమా షూటింగ్‌లను పూర్తి చేశారు. ఇప్పుడు శాంతరుబున్ అనే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సమంత రెడీ అయ్యారు. ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో రూపొందనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణసంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్లో కొత్త సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సమంత. ఈ సినిమాకు హరీశ్ నారాయ ణన్ దర్శకుడు. ఈ సినిమాలతో పాటు ఓ హిందీ చిత్రం, ఓ వెబ్‌సిరీస్ కూడా సమంత సై అన్నారని తెలిసింది.