నటి, మోడల్ పూనమ్ పాండే మరణించినట్లుగా, ఫిబ్రవరి 02న ఆమె ఇన్స్టాగ్రామ్ అఫిషియల్ హ్యాండిల్ నుంచి ఓ సందేశం షేర్ చేయబడింది. సర్వైవల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్) కారణంగా పూనమ్ చనిపోయినట్లుగా ఆ ఇన్‌స్టా మేసేజ్‌లో షేర్ చేయబడింది. దీంతో పూనమ్ పాండే చనిపోయారనే అందరు అనుకున్నారు. కానీ పూనమ్ పాండే చనిపోయినట్లుగా ఆమె స్వస్థలం కాన్పూర్ నుంచి ఏలాంటి ధ్రువీకరణ సమాచారం లేదు. కుటుంబసభ్యులు కూడా ఈ విషయంపై స్పందించలేదు. పైగా సోషల్ అటెన్షన్ కోసం పూనమ్ పాండే ఇలా చేసి ఉంటారని, ఆమెతో పాటు రియాలిటీ షోలలో పాల్గొన్న కంటెస్టెంట్స్ అభిప్రాయపడ్డారు. ఇలా పూనమ్ మృతిపై గందరగోళం నెలకొంది. కాగా ఈ విషయంపై పూనమ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ‘‘నేను బతికే ఉన్నాను. మరణించలేదు. గర్భాశయముఖద్వార క్యాన్సర్‌ను గురించిన అవగాహన కోససే నేను చనిపోయినట్లుగా ఫ్రాంక్ చేశాను. అయితే నా అభిమానులను చాలామందిని హార్ట్ చేసినందుకు బాధగా ఉంది. కానీ క్యాన్సర్స్పై అవగాహన కల్పించేందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది’’ అంటూ వీడియోలు రిలీజ్ చేశారు పూనమ్. దీంతో పూనమ్వైఖరిపై నెటిజన్లు, మీడియా ఫైర్ అవుతోంది. అవగాహన కోసమైతే మరో మార్గం చూసుకోవాల్సిందని, అంతేకానీ..ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు నెటిజన్లు.
#PoonamPandey #PoonamPandeyDead
Actress Poonam Pandey is alive, issues video on Instagram claiming ‘awareness’ for Cervical Cancer pic.twitter.com/f0BgwUWCBA
— TollywoodHub (@tollywoodhub8) February 3, 2024
ఇక ఈ సంగతి ఇలా ఉంచితే…ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగానే పూనమ్ పాండే ఇలా చేసినట్లుగా తెలస్తోంది.