సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ఎనలేని ప్రాముఖ్యం ఉంది. తాజాగా 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగింది. మొత్తం 23 విభాగాల్లో అవార్డల ప్రధానం జరిగింది. జిమ్మి కెన్నల్ నాలుగోసారి ఆస్కార్ హోస్ట్‌గా వ్యవహరించారు. 2024 ఆస్కార్ అవార్డ్స్‌లో మొత్తం 7 అవార్డులును కొల్లగొట్టింది ఓపెన్‌హైమర్ చిత్రం. పదమూడు నామినేషన్లు దక్కించుకున్న ఈ చిత్రం బెస్ట్ పిక్చర్,
ఎడిటింగ్, డైరెక్టర్, లీడ్ యాక్టర్, ఒరిజినల్ స్కోర్, సపోర్టింగ్ యాక్టర్ విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ నెక్ట్స్ పూర్‌థింగ్స్ ఫర్వాలేదనిపించుకుంది.
బెస్ట్ ఫిల్మ్ : ఓపెన్ హైమర్
బెస్ట్ డైరెక్టర్ : క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
బెస్ట్ యాక్టర్ : సిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
బెస్ట్ యాక్ట్రస్ : ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ : రాండాల్ప్ (ది హోల్డోవర్స్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: రాబర్ట్ డౌనీ జూనియర్
బెస్ట్ సినిమాటోగ్రఫీ ఓపెన్‌హైమర్
ఓరిజినల్ స్కోర్: ఓపెన్‌హైమర్
ఓరిజినల్ సాంగ్: వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? (బార్భీ మూవీ)
ఫిల్మ్ ఎడిటింగ్: ఓపెన్‌హైమర్
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్: రాబర్ట్ డాన్వే జూనియర్ (ఓపెన్‌హైమర్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ గాడ్జిల్లా మైనస్ వన్
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ద వండ్రపుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
బెస్ట్ సౌండ్ జోన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: పూర్ థింగ్స్
ప్రొడక్షన్ డిజైన్: పూర్ థింగ్స్
కాస్ట్యూమ్ డిజైన్: పూర్ థింగ్స్
#Oscars2024#jhonpic.twitter.com/grlxPzURaE
— TollywoodHub (@tollywoodhub8) March 11, 2024
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: అమెరికన్ ఫిక్షన్
బెస్ట్ ఓరిజినల్ స్క్రీన్ ప్లే: అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
బెస్ట్ యానిమేటేడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హెరాన్
యానిమేటేడ్ షార్ట్ ఫిల్మ్: వార్ ఈజ్ ఓవర్
95వ ఆస్కార్ అవార్డ్స్‌లో యాక్టింగ్ విభాగంలో విజేతలుగా నిలిచినవారు ఈ ఏడాది (2024) యాక్టింగ్ విభాగంలో నామినేటషన్ దిక్కించుకున్నవారి పేర్లను ప్రకటించారు. గతంలో 2009లో ఇలా జరిగింది. మళ్లీ ఇప్పుడు జరిగింది.
దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. గతంలో నోలన్ మూడునాలుగుస్లారు నామినేట్ అయినప్పటికీని ఆస్కార్ అవార్డును ముద్దాడలేకపోయారు. ఈ సారి ‘ఓపెన్ హైమర్’ చిత్రంతో కుదిరింది.
పూర్‌థింగ్స్ సినిమాకు గాను ఎమ్మాస్టోన్ తొలిసారిగా ఉత్తమ నటి విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఇంతకుముందు 2018లో ఎమ్మాస్టోన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ విభాగంలో అవార్డు అందుకున్నారు. మొత్తంగా ఎమ్మో స్టోన్‌కు ఇది రెండో ఆస్కార్ అవార్డు.
95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణి చంద్రబోస్‌లు అవార్డులు అందుకున్నారు. అయితే ఇండియాకు ఈ ఏడాది అంటే 96వ అవార్డ్స్‌లో ఏ అవార్డు కూడా రాలేదు. భారత సంతతి దర్శకురాలు నిషా తీసిన ‘టు కిల్ఏ టైగర్’ కు నామినేషన్ దక్కినా అవార్డు రాలేదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని క్లైమాక్స్ స్టంట్ సీక్వెన్స్, ‘నాటు నాటు’ సాంగ్ సీక్వెన్స్‌లు ఆస్కార్ విజువల్స్‌లో ప్రదర్శితమైయ్యాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఇలా మరోసారి ఆస్కార్ వేదికపై కనిపించినట్లయింది.
చాలామంది ఈ అవార్డు ఫంక్షన్లో తొలిసారిగా విజేతలుగా నిలిచారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్..ఇలా మరికొందరు తొలిసారిగా అవార్డులు సాధించనవారే కావడం విశేషం.