2024Oscar: ప్రపంచ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం 20204 మార్చి 10న లాస్ ఏంజిల్స్ లో జరగనుంది. అని అకాడమీ ప్రతినిధులు ఏప్రిల్ 24న అధికారికంగా ప్రకటించారు. కేవలం అవార్డుల ప్రధానోత్సవ తేదీ మాత్రమే కాదు… ఈ వేడుకకు సంబంధించిన ఇతర విషయాలను ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు.
2023 డిసెంబర్ 21న 96వ ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితాను వెల్లడిస్తారు. 2024 జనవరి 23న నామినేషన్ జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 22, 2024న ఫైనల్ ఓటింగ్ మొదలవుతుంది. 27 2024న ఓటింగ్ ముగుస్తుంది. 2024 మార్చి 10న జరిగే ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవంలో విజేతలను ప్రకటిస్తారు. మొత్తం 23 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రకటిస్తారు.